అనసూయపై నెటిజన్ వివాదాస్పద కామెంట్: ఇద్దరు బిడ్డల తల్లి అలానా? ఆమె ఏం రిప్లై ఇచ్చిందో తెలిస్తే!
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. తద్వారా స్టార్ హోస్టులుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన ఈ భామ.. ఆ తర్వాత వెండితెరపైనా సత్తా చాటింది.
తద్వారా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.. చాలా కాలంగా అనసూయ డ్రెస్‌ల గురించి విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నెటిజన్ ఆమె బట్టలపై వివాదాస్పద కామెంట్స్ చేశాడు. దీనికి అనసూయ ఏం రిప్లై ఇచ్చిందో మీరే చూడండి!

జబర్ధస్త్‌గా అనసూయ ప్రయాణం
చాలా కాలం క్రితమే అనసూయ యాంకర్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. జబర్ధస్త్ షో ద్వారా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో గుర్తింపును దక్కించుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు నడుపుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది.

సినిమాల్లోనూ సత్తా చాటుతోంది
బుల్లితెరపై యాంకర్‌గా సత్తా చాటుతోన్న అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోనూ తనదైన శైలి నటనతో మాయ చేస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయన'తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్స్‌లో కనిపించింది.

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా
అనసూయ భరద్వాజ్ గతంలో మాదిరిగా బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. అయితే, ఆమె ఇప్పుడు ఎక్కువగా సినిమాలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'గాడ్ ఫాదర్', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీనే
వరుసగా షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో అనసూయ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది.

అనసూయ డ్రెస్‌లపై కామెంట్
ఒకవైపు బుల్లితెరపై, మరోవైపు వెండితెరపై సందడి చేస్తోన్న అనసూయ భరద్వాజ్‌పై చాలా కాలంగా వివర్శలు వస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె బట్టల గురించి ఎన్నో రకాల ట్రోల్స్ వస్తున్నాయి. కానీ, వీటిని పట్టించుకోని అనసూయ.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమెకు మరోసారి సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది.

ఇద్దరు బిడ్డల తల్లి ఇలాగేనా?
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో తనపై వచ్చే పోస్టులపై అనసూయ స్పందిస్తుంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు' అని కామెంట్ చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను అనసూయ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది.

పరువు తీస్తున్నావని స్ట్రాంగ్ రిప్లై
నెటిజన్ తనపై చేసిన కామెంట్లకు అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ.. 'దయచేసి మీరు మీ పనిని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఇక, అనసూయ ఇచ్చిన సమాధానానికి చాలా మంది నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ఈ మేరకు తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











