అనసూయ షాకింగ్ పోస్ట్: లక్షణాలు ఉన్నాయి.. వాళ్లకు కూడా వచ్చే అవకాశం ఉందంటూ బాంబ్ పేల్చింది

బుల్లితెరపై తనదైన శైలి యాంకరింగ్‌తో సత్తా చాటుతూ.. ఎనలేని గుర్తింపును అందుకుంది హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఆకట్టుకునే అందంతో పాటు అద్బుతమైన టాలెంట్ ఉన్న ఈమె.. చాలా ఏళ్లుగా తన హవాను చూపిస్తోంది. టెలివిజన్ రంగంలోనే కాదు.. వెండితెరపైనా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోంది. తద్వారా ఎంతో మంది అభిమానులను సైతం సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఇలాంటి సమయంలో అనసూయ ట్విట్టర్‌లో కరోనా గురించి షాకింగ్ పోస్ట్ పెట్టింది. అంతేకాదు, వాళ్ల గురించి చెప్పుకొచ్చింది. ఆ వివరాలు మీకోసం!

అనసూయ అలా మొదలు పెట్టింది

అనసూయ అలా మొదలు పెట్టింది

తెలుగు రాష్ట్రానికి చెందిన అనసూయ ఎంబీఏ పూర్తి చేసి... స్టాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత అక్కడ రాజీనామా చేసి యాక్టింగ్ వైపు అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యూస్ చానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది. అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంతో తన ప్రియుడు సుశాంక్‌ను వివాహం చేసుకుంది. అతడి ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

జబర్ధస్త్‌ ఎంట్రీ... సరైన బ్రేక్ వచ్చింది

జబర్ధస్త్‌ ఎంట్రీ... సరైన బ్రేక్ వచ్చింది

న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న సమయంలోనే అనసూయకు భారీ ఆఫర్ వచ్చింది. అదే... ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ యాంకరింగ్ ఆఫర్. అందులోకి ఎంటర్ అయిన కొద్ది సమయంలోనే అనసూయకు మంచి పేరు వచ్చింది. అంతేకాదు, భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అందుకుంది. ఫలితంగా ఎన్నో అవకాశాలను దక్కించుకుంది.

అక్కడ కూడా అదుర్స్ అనిపించేలా

అక్కడ కూడా అదుర్స్ అనిపించేలా

జబర్ధస్త్‌తో వచ్చిన స్టార్‌డమ్‌ను తనకు అనుకూలంగా మలచుకోవడంలో అనసూయ సూపర్ సక్సెస్ అయింది. ఇందులో భాగంగానే టీవీ ఆఫర్లతో పాటు సినిమా అవకాశాలనూ అందుకుంది. ఈ క్రమంలోనే 'సోగ్గాడే చిన్ని నాయన', 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో సినిమాల్లో నటించింది. మరీ ముఖ్యంగా క్షణం, రంగస్థలంలో ఆమె పాత్రలకు ప్రశంసలు దక్కాయి.

ఆ పనులు చేస్తూ... విమర్శలపాలు

ఆ పనులు చేస్తూ... విమర్శలపాలు

వరుసగా సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ వెళ్తోంది అనసూయ భరద్వాజ్. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలు అందులో పోస్ట్ చేస్తోంది. అలాగే, తన ఫోటోలనూ వదులుతోంది. ఈ క్రమంలోనే కొన్ని హాట్ ఫొటోల వల్ల నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోందీ ముద్దుగుమ్మ.

లక్షణాలు ఉన్నాయన్న అనసూయ

లక్షణాలు ఉన్నాయన్న అనసూయ

కరోనా వైరస్ సినీ పరిశ్రమపై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అన్నీ ఆగిపోయి నష్టాలను ఎదుర్కోవడంతో పాటు వైరస్ బారిన పడి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే ఎంతో మంది కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు కూడా కరోనా లక్షణాలు ఉన్నాయని చెబుతూ ఆదివారం ఉదయాన్నే అనసూయ భరద్వాజ్ షాకింగ్ పోస్ట్ చేసింది.

వాళ్లకు కూడా వచ్చే అవకాశం ఉంది

వాళ్లకు కూడా వచ్చే అవకాశం ఉంది

అనసూయ తన ట్విట్టర్‌‌లో 'ఓ ఈవెంట్‌ కోసం కర్నూలు వెళ్లేందుకు ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచాను. అప్పుడే నాకు కరోనా లక్షణాలు ఉన్నాయని గ్రహించాను. దీంతో ప్రయాణాన్ని ఆపుకున్నాను. వెంటనే నేను టెస్ట్ చేయించుకుంటా. అలాగే, ఇటీవలి కాలంలో నాతో ఉన్న వాళ్లకూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరీక్ష చేయించుకుని, రిపోర్టును షేర్ చేయండి' అని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X