అనసూయ చేతిపై ఉన్న పేరుకు అర్థం ఇదే.. నిజంగా నమ్మలేరు.!
బుల్లితెర యాంకర్ అనసూయ.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె చాలా ఫేమస్. టీవీ షోలైనా సినిమాలు అయినా ఈమె రంగంలోకి దిగిందంటే ఆ ప్రత్యేకతే వేరు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఓ వైపు టీవీ షోలు.. మరోవైపు, సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

కథనంతో ప్రేక్షకుల ముందుకు
అనసూయ తాజా చిత్రం ‘కథనం'. ఇందులో ఆమె రైటర్ పాత్రలో నటించింది. ఆమె రాసిన కథ బయట జరుగుతుంది. అక్కడ గజల్ శ్రీనివాస్ రాసిన కథే బయట కూడా జరుగుతుంటుంది. ఇక్కడ కూడా కథలో మర్డర్ జరుగుతుందని రాస్తే.. బయట కూడా జరుగుతుంది. ఆ మర్డర్ మిస్టరీ చుట్టూ కథనం కథ అల్లుకున్నాడు దర్శకుడు రాజేష్ నాదెండ్ల. రెండు రోజుల క్రితమే వచ్చిన ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించలేదు.

సోషల్ మీడియాలో యవ యాక్టివ్
అనసూయ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకోవడం పరిపాటి అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ కూడా తరచూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సార్లు ట్రోలర్స్ బారిన పడుతోంది.
చర్చనీయాంశం అయిన టాటూ
అనసూయ షేర్ చేస్తున్న ఫొటోలు ఎలా ఉన్నా.. ఈ మధ్య జనాలను ఆకర్షించినవి మాత్రం ఆమె టాటూలే. ఎదపై ఒక టాటూ.. చేతిపై ఒక టాటూ వేసుకుంది అనసూయ. ఎదపై ఉన్న టాటూకు ఇటీవల అర్థం చెప్పింది అను. ఆమె చేతిపై ‘నిక్కూ' అనే టాటూ ఉంది. దీని గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు వివరిస్తూ.. ‘అది నీక్కు.. నా భర్త ముద్దు పేరు' అని చెప్పింది.

చేతి మీద టాటూ మాత్రం..
అనసూయకు చేతిపైన ఉన్న ‘కలోన్' అనే టాటూకు ఎవరికీ అర్థం తెలియదు. వాస్తవానికి ఇది గ్రీకు పదం. గ్రీకు తత్వవేత్తల ప్రకారం కలోన్ అంటే ‘శరీరం ఒక్కటే అందం కాదు.. దాని కంటే మనసు ఇంకా అందమైనది' అని అర్థం. ఇది తెలియక చాలా మంది పలు రకాలుగా ఊహించేసుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











