For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్ కమెడియన్‌‌తో కలిసి అనసూయ రచ్చ.. అలా కనిపించి షాకివ్వబోతుందట!

  |

  అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై కొంత కాలంగా తన హవాను చూపిస్తూ దూసుకుపోతోంది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ఏమాత్రం అంచనాలు లేకుండానే గ్లామర్ ఫీల్డులోకి అడుగు పెట్టిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అనసూయ భరద్వాజ్.. జబర్ధస్త్ కమెడియన్ కోసం ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ఎద అందాలతో ఆకట్టుకొంటున్న నిక్కి తంబోలి.. బీచ్‌లో ఖత్రోంకి ఖిలాడి

  అనసూయ అలా ఎంట్రీ ఇచ్చింది

  అనసూయ అలా ఎంట్రీ ఇచ్చింది

  చదువుకునే రోజుల్లోనే అనసూయ.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాగ' సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఎంబీయేను పూర్తి చేసింది. అనంతరం మరోసారి ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు సాగించింది. సరిగ్గా అప్పుడే ఓ ప్రముఖ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా పని చేసింది. ఆ తర్వాత కొన్ని ఈవెంట్లను హోస్టింగ్ కూడా చేసింది. అలా గ్లామర్ ఫీల్డులోకి అడుగు పెట్టింది.

  జబర్ధస్త్ వల్ల మొత్తం మారిందిగా

  జబర్ధస్త్ వల్ల మొత్తం మారిందిగా

  న్యూస్ ఛానెల్‌లో పని చేస్తోన్న సమయంలోనే అనసూయకు బోలెడు ఆఫర్లు వచ్చాయి. సరిగ్గా అప్పుడే ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్‌ షో ద్వారా యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అందులో గ్లామర్‌తో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఎంతో మందిని తన వైపునకు తిప్పుకుంది. అలా అప్పటి నుంచి వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది.

  సినిమాల్లోనూ సత్తాను చూపింది

  సినిమాల్లోనూ సత్తాను చూపింది

  యాంకర్‌గా తన సత్తాను నిరూపించుకున్న అనసూయ.. సినిమాల్లో హవాను చూపించింది. ‘సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకుంది. దీని తర్వాత ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర', ‘కథనం' సహా ఎన్నో సినిమాల్లో నటించింది. కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఆమె చేసిన సినిమాలన్నింట్లో రంగమ్మత్త పాత్ర హైలైట్ అనొచ్చు.

  ఇప్పుడు ఆ సినిమాలతో బిజీగా

  ఇప్పుడు ఆ సినిమాలతో బిజీగా

  చాలా కాలం పాటు బుల్లితెరపైనే ఎక్కువగా కనిపించిన అనసూయ.. ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించేందుకు మక్కువ చూపిస్తోంది. ఇందులో భాగంగానే వరుస సినిమాలను లైన్‌లో పెడుతోంది. ఇప్పటికే ‘థ్యాంక్యూ బ్రదర్' రిలీజ్ అయింది. ‘రంగమార్తాండ' రెడీగా ఉంది. ఇక, ‘వేదాంతం రాఘవయ్య', ‘ఖిలాడీ', ‘హరిహర వీరమల్లు', ‘పుష్ప' సినిమాల్లో ఆమె కీలక పాత్రలు చేస్తోంది.

  అనసూయ సంచలన నిర్ణయం

  అనసూయ సంచలన నిర్ణయం

  చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న అనసూయ భరద్వాజ్.. ఏ ఛాన్స్‌నూ వదిలి పెట్టడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న లక్ష్యంతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే సినిమాలు, టీవీ షోలు ఒప్పుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో అనసూయ భరద్వాజ్ తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో సైతం నటించాలని సంచలన నిర్ణయం తీసుకుందట.

  జబర్ధస్త్ కమెడియన్‌ కలిసి రచ్చ

  జబర్ధస్త్ కమెడియన్‌ కలిసి రచ్చ

  తీరిక లేని షెడ్యూల్‌లో కూడా ఓ వెబ్ సిరీస్‌కు అనసూయ భరద్వాజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ వెబ్ సిరీస్‌లో జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా నటిస్తున్నాడట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అతడి కోసమే అనసూయ ఇందులో నటించబోతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందట.

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
  అలా కనిపించబోతున్న బ్యూటీ

  అలా కనిపించబోతున్న బ్యూటీ

  తాజా సమచారం ప్రకారం.. ఈ వెబ్ సిరీస్‌లో అనసూయ భరద్వాజ్.. హైపర్ ఆదికి జోడీగా కనిపించబోతుందట. జబర్ధస్త్‌లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే వెబ్ సిరీస్‌కు తీసుకున్నారని అంటున్నారు. ఇక, దీని కోసం ఈ అమ్మడు భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటుందని తెలుస్తోంది. అలాగే, హైపర్ ఆది కూడా ఎక్కువగానే చార్జ్ చేస్తున్నాడని టాక్.

  English summary
  Hot Anchor Anasuya Bharadwaj will do A Web Series. In This Series jabardasth Top Comedian Hyper Aadi Playing Lead Role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X