ఆమెకు కోటి రెమ్యూనరేషన్.. అనసూయకు మాత్రం రూ. 10 లక్షలే.. ఇంట్రెస్టింగ్‌గా మారిన లెక్కలు.!

By Manoj Kumar P

బుల్లితెరపైకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది హాట్ యాంకర్ అనసూయ. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేసిన ఆమెకు.. జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే గుర్తింపు వచ్చింది. ఈ షో ద్వారా అనసూయ పాపులర్ అవడంతో పాటు సినిమా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. దీంతో రెండు రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతోంది. తాజాగా అనసూయ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఆ వివరాలేంటో మీరూ చూడండి.!

చేసిందే తక్కువే.. గుర్తింపు మాత్రం ఎక్కువ

చేసిందే తక్కువే.. గుర్తింపు మాత్రం ఎక్కువ

టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతోన్న అనసూయ.. అప్పుడప్పుడూ వెండితెరపైనా కనిపించి మెప్పిస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. మరీ ముఖ్యంగా ‘క్షణం', ‘రంగస్థలం'లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. ఈ రెండు సినిమాలు అనసూయ కెరీర్‌కు ఊపును తెచ్చాయి.

ఒక సినిమాలో స్పైసీగా.. వాటిలో కన్నింగ్‌గా

ఒక సినిమాలో స్పైసీగా.. వాటిలో కన్నింగ్‌గా

అనసూయను తమ సినిమాల్లో నటింపజేసేందుకు చాలా మంది ఫిల్మ్ మేకర్లు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆమె కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ'లో స్పైసీ రోల్ చేస్తోంది. అలాగే, విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న సినిమాతో పాటు అల్లు అర్జున్ - సుకుమార్ సినిమాలో నెగెటివ్ రోల్స్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో అమ్మడు ఫుల్ బిజీగా ఉంటోంది.

బాలీవుడ్ హిట్ మూవీ రీమేక్‌కూ సంతకం

బాలీవుడ్ హిట్ మూవీ రీమేక్‌కూ సంతకం

రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘అంధాధాన్'. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను యంగ్ హీరో నితిన్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో నటించేందుకు గానూ అనసూయ సంతకం చేసేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆమెకు కోటి.. అనసూయకు 10 లక్షలు

ఆమెకు కోటి.. అనసూయకు 10 లక్షలు

‘అంధాధున్' తెలుగు రీమేక్‌లో అనసూయ చేసేది మాతృకలో టబు చేసిన రోల్ అని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్ మూవీకి గానూ సీనియర్ హీరోయిన్ రూ. కోటి పారితోషికంగా తీసుకుంది. అయితే, అనసూయకు మాత్రం రూ. 10 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కలు చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.

అసలు ఈ సినిమాలో ఏముందంటే...

అసలు ఈ సినిమాలో ఏముందంటే...

బాలీవుడ్‌లో 2018లో విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం ‘అంధాధున్'. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటనకుగానూ ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ పాత్రనే నితిన్ చేయబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X