అనసూయ.. ఏమ్మా డబ్బులు లేవా.. చిరిగిపోయినవి వేసుకున్నావ్?
Recommended Video
'సూయ.. సూయ.. సూయ.. సూయ.. సూయ.. అట్ట ఎట్టా పుట్టేశావే అనసూయ' ఇదీ.. ఓ సినిమాలోని పాట. యాంకర్ అనసూయ చేసిన స్పెషల్ సాంగ్‌లో ఆమె గురించి రాసిన పాట. ఇది ఎంతో ఫేమస్ అయింది. దానికి కారణం పాట కాదు.. అనసూయ. బుల్లితెర యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఈమె చాలా ఫేమస్. తన అభినయం, అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. దీంతో అనసూయకు ఎనలేని క్రేజ్ ఏర్పడింది. అదే స్థాయిలో ఆమెను ట్రోల్ చేసే వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా చేసిన పనితో మరోసారి అనసూయ విమర్శల పాలవుతోంది.

ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ..
అనసూయ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకోవడం పరిపాటి అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ కూడా తరచూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సార్లు ట్రోలర్స్ బారిన పడుతోంది.

డ్రెస్సింగ్‌తో వివాదాలు
అనసూయకు ఎంత పాపులారిటీ ఉందో అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా ఉంది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని ఫొటోలకు భారీ స్థాయిలో వ్యతిరేకత వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికి కారణం స్కిన్ షో చేయడమే. ఈ కారణంగానే ఆమె ఎన్నో వివాదాలను కొని తెచ్చుకుంది. ఈ విధంగానూ అనసూయ తరచూ వార్తల్లోకెక్కుతుంది.
ఇప్పుడు మరోసారి
తాజాగా అనసూయ ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా తీసిన పలు ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో అనసూయ రెడ్ కలర్‌పై వైట్ చెక్స్ ఉన్న షర్టును ధరించింది. అలాగే, దాని కింద థైస్ కనిపించేలా చిరిగినట్లు ఉన్న స్కర్ట్ వేసుకుంది. మొత్తం నాలుగు ఫొటోలను ఆమె షేర్ చేసింది.

ఒక ఫొటో మాత్రం..
అనసూయ షేర్ చేసిన నాలుగు ఫొటోల్లో ఒకటి మాత్రం బాగా ట్రోల్ అవుతుంది. మిగిలిన మూడు ఫొటోలు నిల్చుని ఉంటే.. అందులో మాత్రం కూర్చుని ఉంది. దీంతో ఆమె తొడలు బాగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు చినిగినట్లు ఉన్న ఆ స్కర్ట్ కొంచెం ఎడంగా వెళ్లింది. దీంతో చాలా మంది విమర్శలు చేస్తున్నారు.

సిగ్గుగా అనిపించడం లేదా?
అనసూయ ఫొటోలకు దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ‘ఏమ్మా.. బట్టలు కొనేందుకు డబ్బులు లేవా... చిరిగినావి ఏస్కున్నావ్... సిగ్గనిపించడం లేదా' అని ఓ పెద్దాయన ప్రశ్నించగా.. ‘ఈ స్కర్ట్‌లో చాలా సెక్సీగా ఉన్నారు' అని మరొకరు కామెంట్ పెట్టారు. ఇంకా చాలా మంది దారుణమైన రీతిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











