షర్ట్ బటన్స్ తీసేసి షాకిచ్చిన అనసూయ: అదిరిపోయిన గ్లామర్ ట్రీట్.. అమ్మడి అందాలకు ఫిదా అవ్వాల్సిందే

దాదాపు ఏడెనిమిదేళ్లుగా తెలుగు బుల్లితెరపైనే కాకుండా.. వెండితెరపైనా సందడి చేస్తూ తన సత్తాను నిరూపించుకుంటోంది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. అంతలా ఈ అమ్మడు వరుసగా షోలు, సినిమా ఆఫర్లను అందుకుంటూ తెగ హల్‌చల్ చేస్తోంది. తద్వారా ఫాలోయింగ్‌ను కూడా గణనీయంగా పెంచుకుంటూ దూసుకుపోతోంది.

ఇక, సోషల్ మీడియాలో సైతం ఈ అందాల యాంకర్ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం ఏదో ఒక ఫొటోనో, వీడియోనో వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా షర్ట్ బటన్స్ తీసేసిన కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వివరాల్లోకి వెళితే...

అలా మొదలు పెట్టిన అనసూయ

అలా మొదలు పెట్టిన అనసూయ

సినిమాల్లో నటించాలన్న కోరికతో ఎప్పటి నుంచో ఆ దిశగా ప్రయత్నాలను ప్రారంభించింది అనసూయ. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాగ' అనే సినిమాలో చిన్న పాత్రను పోషించింది. తర్వాత మరో సినిమాలో మాత్రం కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో చాలా కాలం ప్రజెంటర్‌గా పని చేసింది. ఆ సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిందీ బ్యూటీ.

జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో క్రేజ్

జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో క్రేజ్

న్యూస్ ఛానెల్‌లో పని చేస్తోన్న సమయంలోనే అనసూయకు యాంకర్‌గా ఆఫర్లు వచ్చాయి. అప్పుడే 'జబర్ధస్త్' అనే కామెడీ షోలోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన టాలెంట్‌తో పాటు ఆకట్టుకునే అందం ఉండడంతో ఆరంభంలోనే ఆమె మెప్పించింది. దీంతో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. అలా అప్పటి నుంచి వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకెళ్తోంది.

సినిమాల్లోనూ సత్తా.. అన్నింటిలో

సినిమాల్లోనూ సత్తా.. అన్నింటిలో

యాంకర్‌గా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న అనసూయ.. నటిగానూ మైమరపించిందనే చెప్పాలి. 'సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాతో వెండితెరపైకి అడుగులు వేసిన ఆమె.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసింది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసిందీ బ్యూటీ. వీటిలో రంగమ్మత్త పాత్ర స్పెషల్.

ఇప్పుడు ఏ సినిమాలోనైనా ఆమె

ఇప్పుడు ఏ సినిమాలోనైనా ఆమె

ప్రస్తుతం అనసూయ వరుస సినిమా ఆఫర్లతో ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ'లో నటించింది. 'థ్యాంక్యూ బ్రదర్' ఇటీవలే విడుదలైంది. అలాగే సునీల్ 'వేదాంతం రాఘవయ్య', రవితేజ 'ఖిలాడీ'లోనూ కీలక పాత్రలు చేస్తోంది. వీటితో పాటు పవన్ 'హరిహర వీరమల్లు', అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రాల్లోనూ నటిస్తోందీ అందాల యాంకరమ్మ.

లేటు వయసులో.. ఘాటు అందం

లేటు వయసులో.. ఘాటు అందం

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే అనసూయ.. శశాంక్ భరద్వాజ్‌ను పెళ్లాడింది. అంతేకాదు, ఇద్దరు బిడ్డల తల్లైన తర్వాతనే కెరీర్‌ను మొదలెట్టింది. ఏజ్ బారైనా ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోన్న ఈ బ్యూటీ.. తరచూ పొట్టి బట్టలు ధరించి కనిపిస్తుంది. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతుంది. తద్వారా ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొంటోంది.

షర్ట్ బటన్స్ తీసేసిన అనసూయ

షర్ట్ బటన్స్ తీసేసిన అనసూయ

అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ తన ఫొటోలు, వీడియోలతో పాటు ఎన్నో విషయాలను తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. ఈ కారణంగానే ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అనసూయ భరద్వాజ్ షర్ట్ బటన్స్ తీసేసిన హాట్ స్టైలిష్ ఫొటోషూట్‌ను షేర్ చేసింది.

Recommended Video

#VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
అదిరిపోయిన అనసూయ గ్లామర్

అదిరిపోయిన అనసూయ గ్లామర్

తాజాగా అనసూయ భరద్వాజ్ చేసిన ఫొటోషూట్‌లో ఆమె షర్ట్, ప్యాంట్ ధరించి కనిపించింది. వీటిలో స్టైలిష్ ఫోజులతో అమ్మడు తెగ ఆకట్టుకుంది. కొన్నింటిలో షర్ట్ బటన్స్ తీసేసి మరీ కనిపించింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. అదే సమయంలో అనసూయ క్రేజ్‌ను పెంచుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X