Anasuya Bharadwaj ప్రేమలో పడాలంటే.. ముందు చాలా విషయాలు జరగాలి.. అనసూయ భరద్వాజ్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, పాపులర్ ఓటీటీ సంస్థ జీ5 సంయుక్తంగా నిర్మించిన చిత్రం ప్రేమ విమానం. సంతోష్ కాటా దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో రిలీజ్‌కు ఒక రోజు ముందే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్, అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా తదితరులు నటించారు. ఈ వెబ్ సినిమా జీ5 ఓటీటీలో రిలీజ్ అవుతున్న సమయంలో అనసూయ భరద్వాజ్ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
ప్రేమ విమానం సినిమా రిలీజ్‌కు ముందు కొంత టెన్షన్‌గా ఉంది. ఈ సినిమాలో శాంత పాత్రలో నన్ను నేను చూసుకొన్నప్పుడు ఆ రోల్‌తో ప్రేమలో పడ్డాను. అందుకు దర్శకుడు సంతోష్ కాటాకు థ్యాంక్స్ చెప్పుకొంటాను. ఒక సినిమాతో ప్రేమలో పడాలంటే చాలా జరగాలి. ఆ అనుభవాలన్నింటీతో నేను సినిమాతో అనుబంధం ఏర్పరుచుకొన్నాను. ఈ సినిమాలో ఇద్దరు అబ్బాయిలకు తల్లిగా నటించాను. ఈ సినిమా మీకు సంతృప్తిని అందించిందనిపిస్తున్నది. మా ప్రేమ విమానం అక్టోబర్ 12వ తేదీన జీ5 ఓటీటీలో రిలీజ్ అవుతున్నది. తప్పకుండా చూడండి అని అనసూయ భరద్వాజ్ అన్నారు.
జీ5 ఓటీటీలో వరుసగా రెండు సినిమాలు చేశాను. విమానం ముందుగా, ఇప్పుడు ప్రేమ విమానం సినిమా చేయడం అలా జరిగిపోయింది. ఎలాంటి ప్లానింగ్ లేదు. ప్రేమ విమానం సినిమా టైటిల్ పెట్టగానే వెంటనే పరుగెత్తుకెళ్లి.. ఏంటి సార్.. ప్రేమ విమానం అనే టైటిల్ పెట్టారంట అని అడిగాను. దాంతో ఏం టెన్షన్ పడకు. మన కంటెంట్ వేరని డైరెక్టర్ సంతోష్ చెప్పారు. కంటెంట్ విషయంలో ఎలాంటి పోలీకలు లేవు అని అనసూయ భరద్వాజ్ అన్నారు.
నా జీవితంలో నేను నా పెళ్లి జరిగిన తర్వాత తొలిసారి నా భర్తతో విమానం ఎక్కాను. నా పెద్ద కొడుకు పుట్టిన తర్వాత ఫస్ట్ వివాహ వార్షికోత్సవం సమయంలో నేను మున్నార్‌కు వెకేషన్స్‌కు వెళ్లాను. అప్పుడు నేను ఫస్ట్ టైమ్ విమానం ఎక్కాను. దాదాపు 13 ఏళ్ల క్రితం విమానం ఎక్కడం మరిచిపోలేని అనుభూతి అని అనసూయ భరద్వాజ్ చెప్పారు.

లాక్ డౌన్ తర్వాత నేను మంచి సినిమాల్లో నటించాను. నా కోసం మంచి పాత్రలు వచ్చాయి. అయితే నేను ప్లానింగ్ ఏమీ చేసుకోలేదు. ఆడియెన్స్‌ను బోర్ కొట్టించకుండా మంచి పాత్రలు చేయాలని అనుకొన్నాను. చిన్నప్పటి నుంచి ఫ్యాన్సీ డ్రస్ పోటీల్లో రకరకాల గెటప్స్ వేసి బహుమతులు సంపాదించే దానిని. అలాగే ఇప్పుడు కూడా రకరకాల గెటప్స్ రోల్స్ వేసి.. అందరి నుంచి ప్రశంసలు అందుకొంటున్నాను అని అనసూయ చెప్పారు.
నాలో టాలెంట్ గుర్తించి నాకు క్షణం సినిమాలో మంచి ఆఫర్ ఇచ్చిన అడివి శేష్, డైరెక్టర్ రవికాంత్, అలాగే డైరెక్టర్ సుకుమార్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారిద్దరూ బ్రేక్ ఇచ్చారు. వారు ఇచ్చిన అవకాశాలు నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేశాను. నేను ప్రేక్షకుల్లో కూర్చొని సినిమా చూస్తే మంచి అనుభూతిని ఆస్వాదిస్తాను. నేను చేసే పాత్రలు కూడా అలాగే ఉండాలని ప్రయత్నిస్తూ.. క్యారెక్టర్లను ఎంచుకొంటాను. చిన్న చిన్న అడుగులు వేస్తూ అందర్నీ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాను అని అనసూయ భరద్వాజ్ చెప్పారు.

గ్లామర్ నా బలం అనే విషయం నాకు తెలియదు. చాలా మంది నన్ను అలా ఇష్టపడుతారు. కొంత మంది తిట్టుకొంటారు. నా లైఫ్‌లో నేను ఆనందంగా ఉండాలని కోరుకొంటాను. అందు కోసం ఏం చేయాలో అది చేస్తున్నాను. సినిమాలోనైనా, నిజజీవితంలోనైనా నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని అనసూయ తెలిపారు.


Click it and Unblock the Notifications











