For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీనియర్ హీరోయిన్‌కు చెక్ పెట్టిన అనసూయ.. అదే కారణంతోనే అంటూ!

  |

  టెలివిజన్, సినీ రంగంలో కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకొంటూ భారీ ఆఫర్లు దక్కించుకొంటున్న యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందనే విషయం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నది. లాక్‌డౌన్ తర్వాత అనసూయ ఓ ఇంట్రెస్టింగ్ రోల్‌కు ఓకే చెప్పారనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఓ సీనియర్ నటిని తప్పించి అనసూయకు ఆ రోల్‌ ఇచ్చినట్టు తాజా సమాచారం. అయితే ఆ సినియర్ నటిని ఎందుకు తప్పించారనే విషయం చర్చనీయాంశమైంది. అయితే ఆ వార్త వెనుక అసలు కారణం ఏమిటంటే..

  లాక్‌డౌన్‌లోనూ జోష్

  లాక్‌డౌన్‌లోనూ జోష్

  లాక్‌డౌన్‌లో దాదాపు మూడు నెలలపాటు ఇంటికే పరిమితమైన అనసూయ ఎక్కడా తగ్గలేదు. క్వారంటైన్‌ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే ఆన్‌లైన్ ఛానెల్స్‌తో లైవ్ ప్రోగ్రామ్స్, పలువురితో ఇంటర్యూలతో హల్‌చల్ చేశారు. లాక్‌డౌన్ సమయంలోనే నిరాడంబరంగా బర్త్ డేను జరుపుకొని సామాజిక సేవలో నిమగ్నమయ్యారు.

   ఫుల్ జోష్‌తో బుల్లితెరపైకి

  ఫుల్ జోష్‌తో బుల్లితెరపైకి

  ఇక సర్కారు లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లాక్‌డౌన్‌లో ఫుల్లు రీచార్జ్ అయిన అనసూయ మరింత గ్లామరస్‌గా, ట్రెండీగా బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఇలా టెలివిజన్‌లోనే కాకుండా సినిమా ఆఫర్లను కూడా అందిపుచ్చుకొంటున్నారు.

  యువ హీరో సినిమాలో క్రేజీ పాత్ర

  యువ హీరో సినిమాలో క్రేజీ పాత్ర

  తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టుతో అనసూయ మరోసారి వార్తల్లోకి వచ్చారు. హీరో సుమంత్ అశ్విన్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ ఓ సినిమాను ప్లాన్ చేసింది. ఈ సినిమా కోసం గురు పవన్ అనే దర్శకుడిని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి ఇంద్రజను సంప్రదించి ఓకే చేశారు. అయితే తాజాగా ఆమెను తప్పించి అనసూయను తీసుకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించకపోవడంతో ఈ వార్తలో అసలు విషయం ఎంత అనేది ప్రశ్నగా మారింది.

  చెన్నై నుంచి రాలేనంటూ

  చెన్నై నుంచి రాలేనంటూ

  ప్రస్తుతం తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో కరోనా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అయితే చెన్నైలో ఉంటున్న ఇంద్రజ అక్కడి నుంచి హైదరాబాద్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో రాలేనంటూ చెప్పినట్టు సమాచారం. అంతేకాకుండా చెన్నైలో కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో రిస్క్ తీసుకోవడం మంచిది కాదనే నిర్ణయానికి యూనిట్ వచ్చారట. దాంతో నిర్మాత తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా నుంచి తప్పించినట్టు తెలిసింది.

  అనసూయకు ఓటేసిన దర్శకుడు

  అనసూయకు ఓటేసిన దర్శకుడు

  ఆ తర్వాత పలువురు సీనియర్ హీరోయిన్లను పరిగణనలోకి తీసుకొన్న నిర్మాత, దర్శకులు చివరకు అనసూయకు ఓటేసినట్టు సమాచారం. అనసూయ అయితే గ్లామర్‌తోపాటు సినిమాకు క్రేజ్ కూడా వస్తుందని అభిప్రాయంతో ఆమెను ఎంపిక చేసినట్టు తెలిసింది. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.

   అనసూయ కెరీర్ ఇలా

  అనసూయ కెరీర్ ఇలా

  అనసూయ కెరీర్ విషయానికి వస్తే.. క్షణం తర్వాత అనసూయ అంగీకరించే సినిమాలకు సంబంధించి ఓ ప్రత్యేకత కనిపిస్తున్నారు. గ్లామర్ కంటే పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. యాత్ర, రంగస్థలం, F2 - ఫన్ అండ్ ప్రస్టేషన్, కథనం, మీకు మాత్రమే చెప్తా చిత్రాలు అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

  English summary
  Star Anchor and Actress Anasuya Bhardwaj gets a crazy offer a upcoming project. She replaces Senior Heroine in Sumanth Ashwins film which directed by Guru Pawan. Reports suggest that Indraja expresses inability to come hyderabad from Chennai in Coronavirus crisis. So Anasuya got this role by other Chance.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X