క్షమించమన్న అనసూయ.. నన్ను తిట్టారు అయినప్పటికీ అలాగే చేయండంటూ..

అనసూయ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరిది. బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్న ఆమె.. బిజీ బిజీగా గడుపుతోంది. ఒకవైపు టీవీ షోలు చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇందులో భాగంగానే ఆమె నటించిన తాజా చిత్రం 'కథనం'. ఈ సినిమా విడుదలకు దగ్గరవుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనసూయ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

మీరు ఏం రాస్తే అదే అవుతారు

మీరు ఏం రాస్తే అదే అవుతారు

ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా ప్రతినిధులను ఉద్దేశించి.. ‘మీరు ఏం రాస్తే అదే అవుతారు. నా గురించి మంచి రాశారు.. చెడు రాశారు.. తిట్టారు.. పొగిడారు. నా మీద వచ్చిన వార్తలు చూసి, నేనింకా మొండిదాన్ని అయ్యాను. స్ట్రాంగ్‌గా అయ్యాను. సంకల్పం ఎక్కువైపోయింది. నేనెవరి మీదా కంప్లైంట్ చేయడం లేదు' అని అనసూయ చెప్పుకొచ్చింది.

క్షమించమన్న అనసూయ

క్షమించమన్న అనసూయ

తనపై వస్తున్న వార్తల గురించి మాట్లాడుతూ.. ‘ఇప్పుడు నేను మాట్లాడుతుంటే థంబ్‌నెయిల్స్ నాకు గుర్తొస్తున్నాయి. నేనెలా వచ్చాను..? ఎలా మాట్లాడాను..? అనేది రాస్తారు. క్షమించమని అడిగిన అనసూయ అని టప్‌మని పెట్టేస్తారు. దీంతో ఇప్పుడేం చూసింది ఈమె అని అందరూ చూస్తారు' అని ఆమె వివరించింది.

నా గురించి రాయండి

నా గురించి రాయండి

పలు మీడియా సంస్థలు తనపై రాస్తున్న కథనాలపై అనసూయ స్పందించింది. ‘మీరు నా మీద ఏం రాస్తారో అవన్నింటినీ ఇష్టపడుతున్నాను. ఇకపై కూడా మీరు వాటిని కొనసాగించండి. కానీ, నేను మీ అమ్మాయిని. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను. ఇంత వరకు రావడం ఎంత కష్టమో మీకు తెలుసు' అని ఈ లేడీ యాంకర్ కమ్ హీరోయిన్ పేర్కొంది.

అలా చేస్తే యాక్టింగ్ చేస్తా

అలా చేస్తే యాక్టింగ్ చేస్తా

తనకు అందరి ముందు యాక్టింగ్ చేయడం రాదని చెప్పిన అనసూయ.. ‘నాకు మెయింటేన్ చేయడం రాదు. చాలా మంది నన్ను మెయింటేన్ చేయమని చెబుతుంటారు. కానీ, నాకు రాదు. నేనిలానే ఉంటాను. యాక్షన్ అన్న మాట వింటేనే నటన వస్తుంది. లేదు నేను నటించాలంటే మీరు వచ్చినప్పుడల్లా యాక్షన్ అనండి నటిస్తా' అంటూ మీడియా ప్రతినిధులకు తెలిపింది.

‘కథనం' గురించి..

‘కథనం' గురించి..

అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం'. ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బీ నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించిన ఈ సినిమాను రాజేష్ నాదెండ్ల తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో అనసూయతో పాటు వెన్నెల కిషోర్, ధన్‌రాజ్ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X