అనసూయ అందాల సునామీ: క్లోజప్ షాట్‌లో మైండ్ బ్లోయింగ్
చూపు తిప్పుకోకుండా చేసే అందం, అదిరిపోయే టాలెంట్లతో తెలుగు పరిశ్రమలో తనదైన శైలిలో అలరిస్తూ దూసుకుపోతోంది ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్. సాదాసీదాగానే కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ అమ్మడు.. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్‌గా మారిపోయింది. ఫలితంగా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ మధ్య కాలంలో చాలా భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. అయినప్పటికీ అనసూయ సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసమే!
జబర్ధస్త్‌తో కెరీర్ టర్నింగ్:న్యూస్ ప్రజెంటర్‌గా ఫేమస్ అయిన అనసూయ భరద్వాజ్ 'జబర్ధస్త్' కామెడీ షోతో యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఇందులో గ్లామర్‌తో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో అలరించిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరును దక్కించుకుంది. తద్వారా ఫాలోయింగ్‌తో పాటు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటూ దూసుకెళ్లింది. తద్వారా క్రేజ్ సంపాదించింది.

సినిమాల్లోనూ సత్తా చాటి:టెలివిజన్ రంగంలో హవాను చూపించిన అనసూయ.. 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాలతో సత్తా చాటింది. అలాగే, కొన్ని మూవీల్లో స్పెషల్ సాంగ్‌లలోనూ మెరిసింది. ఇలా సినిమాల్లోనూ తనదైన మార్కును చూపిస్తూనే ఉంది.
వరుస సినిమాలతో హవా:కొంత కాలంగా టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న అనసూయకు మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ ఏడాది 'మైఖేల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, వరుసగా 'రంగమార్తాండ', 'విమానం' మూవీలను కూడా చేసింది. వీటితో పాటు 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2' వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. వేరే భాషల్లోనూ సినిమాలు చేస్తోంది.

బుల్లితెరపైకి రీఎంట్రీతో:కొద్ది నెలల క్రితమే జబర్ధస్త్‌తో పాటు ఈటీవీ నుంచి తప్పుకున్న అనసూయ భరద్వాజ్.. 'సూపర్ సింగర్ జూనియర్' షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా చేసింది. ఈ షో పూర్తైన తర్వాత నుంచి అనసూయ బుల్లితెరపై కనిపించలేదు. కానీ, ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఆమె సన్నిహితులు మాత్రం సినిమాలకే ప్రాధాన్యం ఇస్తుందని చెప్తున్నారు.

అందులోనే ఉంటోంది:ఏకధాటిగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోన్నా.. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటోంది. ఈ కారణంగానే ఆమె ఫాలోయింగ్ పెరుగుతోంది.

గ్లామర్ ట్రీట్‌తో హల్చల్:గతంలో కంటే ఈ మధ్య కాలంలో చాలా మంది భామలు సోషల్ మీడియా ద్వారా అందాలను ఆరబోస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ భరద్వాజ్ కూడా తరచూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఫలితంగా సోషల్ మీడియాలో అనసూయ పేరు ట్రెండింగ్ అవుతోంది.
అందాలను ఆరబోస్తూ:తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అనసూయ భరద్వాజ్ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె డీప్ నెక్ టాప్‌ను ధరించింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











