మరోసారి బికినీలో అనసూయ మాయ.. అందాల ఆరబోతకు హద్దే లేనట్లుగా!
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలు గ్లామర్ ఫీల్డులోకి రావాలంటే ఆలోచించే వాళ్లు. కానీ, ఇప్పుడు మాత్రం ఎంతో మంది భామలు సినిమాల్లో, షోలలో సందడి చేస్తున్నారు. వారిలో కొందరు స్టార్లుగానూ మారిపోయారు. అలాంటి వారిలో యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఒకరు. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సెగలు రేపుతోంది. ఇలా తాజాగా అనసూయ ఓ బోల్డు వీడియోను షేర్ చేసింది. దాన్ని మీరే చూసేయండి!
స్టార్ యాంకర్.. గ్యాప్ ఇచ్చి
అనసూయ భరద్వాజ్ 'జబర్ధస్త్' షోతో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిపోయింది. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుసగా షోల మీద షోలు చేస్తూ వచ్చింది. అలా ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన రీతిలో హవా చూపింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అనసూయ టెలివిజన్ రంగానికి, యాంకరింగ్‌కు పూర్తిగా దూరం అయిపోయింది.

వరుసగా సినిమాలు చేస్తూ
చాలా కాలం పాటు బుల్లితెరపై సత్తా చాటిన అనసూయ.. ఈ మధ్య కాలంలో మాత్రం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది 'మైఖేల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, వరుసగా 'రంగమార్తాండ', 'విమానం', 'పెద కాపు 1', 'ప్రేమ విమానం' వంటి మూవీలలో అదిరిపోయే పాత్రలను చేసి మార్కులు కొట్టేసింది.
ఇప్పుడా ప్రాజెక్టులతో బిజీ
ఎన్నో చిత్రాలతో తనదైన నటనతో మాయ చేసిన అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు కూడా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈ సుందరాంగి 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2' వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అలాగే, తమిళంలో 'ఫ్లాష్‌బ్యాక్' సహా కొన్ని సినిమాలు చేస్తోంది. ఇలా పలు భాషల చిత్రాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ
ఏమాత్రం బ్రేకులు లేకుండా సినిమాలు చేస్తోన్నా.. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ యమా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలను తన ఖాతాల్లో షేర్ చేస్తోంది. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటూ అభిమానాన్ని మరింతగా పెంచుకుంటోంది.
అందుకు భిన్నంగా షో
తెలుగు భామలు పెద్దగా అందాల ఆరబోతకు ముందుకు రారు అన్న టాక్ ఉండేది. కానీ, ఇప్పుడు చాలా మంది గ్లామర్ షోతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. అందులో అనసూయ భరద్వాజ్ పేరు ముందే చెప్పుకోవాలి. అంతలా ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో సంచలనం సృష్టిస్తోంది.
బికినీ వీడియోతో హల్చల్
అనసూయ భరద్వాజ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె వైట్ కలర్ టూ పీస్ బికినీలో కనిపించి రెచ్చిపోయింది. ఫలితంగా ఈ వీడియోలో ఆమె అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో అనసూయ షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఇది వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











