పవన్ కళ్యాణ్ తో డ్యాన్స్... నాపై ట్రోల్స్ అందుకే.. అనసూయ షాకింగ్ కామెంట్స్!

యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. 'జబర్దస్త్' కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించిన ఈమె అతి తక్కువ సమయంలోనే బుల్లితెర ఆడియెన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను దక్కించుకుంది. ఆమె అందం, యాంకరింగ్ స్కిల్స్, డ్యాన్స్, ఆకట్టుకునే వస్త్రాధారణతో మరింతగా క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలో అనసూయ పలు మార్లు ట్రోల్స్ కు కూడా గురైంది. తాజాగా ఆ విషయాలపై ఫన్నీగా స్పందించింది.

అనసూయ ప్రస్తుతం నటిగానే ఆడియెన్స్ ను అలరిస్తున్న సంగతి తెలిసిందే. 'జబర్దస్' వేదికపై పదేళ్లకు పైగా యాంకర్ గా అలరించింది. ఆ సమయంలో అనసూయ కాస్ట్యూమ్స్, డ్యాన్స్ పైనా ట్రోల్స్ పెద్ద ఎత్తున నడిచాయి. బుల్లితెరపై వెండితెర హీరోయిన్ లా మెరియడంతో ఆమె అతిచేస్తుందన్న సెన్స్ వెళ్లింది. అనసూయ ఎంత శ్రద్ధగా తన డ్యూటీని చేసినా.. ఏదోలా మాత్రం ట్రోల్స్ కు గురవుతూనే ఉండేది. అంతమాత్రాన ఆమె భయపడేదే గుణం కాదండోయ్.. ఎప్పటికప్పుడు ట్రోల్స్ ను ఎదుర్కుంటూనే వచ్చింది.

Anchor Anasuya Bhardwaj Dance with Pawan Kalyan in Hari Hara Veera Mallu she responded on trolls also

తనపై వచ్చిన ట్రోల్స్ ను తిప్పికొట్టేలా బదులిచ్చిన సందర్భాలెన్నో. మరోవైపు సమాజంలోని పలు అంశాలపైనా అనసూయ తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తన అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేస్తూ నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారుతుంటారు. ఇక ప్రస్తుతం సినిమాల్లో వరుసగా కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే అనసూయ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' చిత్రంలో నటించే అవకాశం సొంతం చేసుకుంది. అంతే కాదు ఏకంగా పవన్ కళ్యాణ్ తో కలిసి డ్యాన్స్ కూడా చేసింది.

రిలీజ్ కు సిద్ధమవుతున్న 'హరిహర వీరమల్లు' నుంచి ప్రస్తుతం వరుసగా అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. రీసెంట్ గానే సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టిందిరో' ప్రోమో విడుదలైంది. ఆ సాంగ్ లో అనసూయ, పూజితా పొన్నాడ కనిపించి ఆశ్చర్యపరిచారు. ఇదే విషయమైన అనసూయ ఓ ఈవెంట్ లో మాట్లాడింది. తొలిసారిగా పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం చాలా బాగుందన్నారు. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం గర్వంగా ఉందని చెప్పింది. ఆ సాంగ్ చాలా బ్యూటీఫుల్ గా ఉంటుందని, ఎప్పటి నుంచో సాంగ్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పింది.

Anchor Anasuya Bhardwaj Dance with Pawan Kalyan in Hari Hara Veera Mallu she responded on trolls also

కానీ పవన్ సార్ ఏపీ రాజకీయాల్లో బిజీ కావడం వల్ల ఆలస్యమవుతూ వచ్చిందని తెలిపింది. ఏదేమైనా పవన్ సార్ డిప్యూటీ సీఎం కావడం గర్వంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగానే తనపై ట్రోల్స్ జరగడాన్ని కూడా గుర్తు చేసింది. తన కెరీర్ లో డ్యాన్స్ వల్లే ట్రోల్స్ ట్రెండ్ మొదలైందని తెలిపింది. కానీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి డ్యాన్స్ చేయడం.. ఫస్ట్ టైమ్ సినిమాటిక్ వేలో పెర్ఫామ్ చేయడంతో వాటన్నింటికి సమాధానం అవుతుందని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X