విడాకుల తర్వాత.. నా జీవితం ప్రశాంతంగా ఉంది

'విడాకుల తరువాత కాస్త ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో నా అవకాశాలను నాతో పోటీపడేవారు లాగేసుకున్నారు. మనం నాలుగు చేతులతో యుద్ధం చేస్తున్న చోట అన్నింటిని గెలువలేం కాదా.. ఆ రేసులో వెనుకబడిన విషయం వాస్తవమే. కానీ, దానితో నాకు అంతగా నష్టమేమి జరగలేదు. నేను ఎప్పటికప్పుడు యాక్సెటెబుల్ గా ఉన్నాను. కాబట్టి.. నాకు తెలుసు పెద్దగా నష్టం జరగలేదు. అది మాత్రం క్లిష్ట సమయం. అయితే.. నేను ఏ రోజు కూడా నోరు విప్పి నాకు జరిగిన అన్యాయం జరిగిందని, నా జీవితం గురించి ఏడవలేదు. నాకు మీరు సాయం చేయండని పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. నేను ఏమి చేయాలనుకున్నానో.. నా మార్గాన్ని నేనే ఎంచుకున్నాను.' ప్రముఖ సెలబ్రెటీ వ్యాఖ్యలివి.

అంతేకాదు.. 'నాకేం కావాలనుకున్నానో అది నేను చేసుకుంటూ వెళ్లాను. విడాకుల అనంతరం మా ఇద్దర్నీ కలపాలని చాలా మంది ట్రై చేశారు. కానీ, నేను అనుకుంటున్నటు వంటి నా సంతోషకరమైన జీవితాన్ని వాళ్ళు నిర్వచించడం నాకు నచ్చలేదు. నా సంతోషము. నా జీవితము నేను నిర్వచించుకుంటాను. గౌరవంగా ఉంటూనే సమాజంలో నేనెలా ఉండాలనేది నాకు తెలుసు. నా గీతలు నేను గీసుకున్నాను. నాకు స్కెచ్ నేను వేసుకుంటాను.. నా జీవితంతో నా హ్యాపీనెస్ లేనప్పుడు ఇతరులతో నేను ఎందుకు బతకాలి. అలాగే.. జీవితాన్ని నేను ఎప్పుడు కెమెరా ముందు పెట్టాలని భావించలేదు. అలాగే.. ఉంటారని కోరుకున్నాను' అంటూ ఆ సెలబ్రెటీ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Anchor jhansi career and personal Life jhansi special exclusive interview

'మనం ఒకటి అనుకుంటే జీవితంలో మరోకటి జరుగుతోంది. మనం అనుకున్నట్టు అంత ఈజీ కాదు జీవితం. నేను కొంత ఇబ్బంది పడ్డ మాట నిజమే. మనం కష్టం వచ్చినప్పుడే స్ట్రాంగ్ గా ఉండాలి. నీకోసం నీ పిల్లల కోసం నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఇతరులపై ఆధారపడి ఉండకుండా.. నువ్వు సంపాదించుకోవాలి. ఇండిపెండెన్స్ ఉండాలి. నా ఫ్యామిలీ చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. అంటే.. నా నిర్ణయాన్ని వాళ్లందరూ గౌరవించారు' అని యాంకర్ నటీ ఝాన్సీ పేర్కొంది.

స్టార్ యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పేరు తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. అటు బుల్లితెర తో పాటు ఇటు వెండితెరపై కూడా ఆమె ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కేవలం తన 8 ఏళ్లల్లోనే రేడియో జాకీగా తన కెరియర్ ప్రారంభించింది. తన మాటలతో మాయ చేస్తోంది యాంకర్ ఝాన్సీ. అనంతరం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది. మరో వైపు ఒక మీడియా ఆక్టివేట్ గా ఎదిగింది ఝాన్సీ.

ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఝాన్సీ చిరునవ్వుతో ఆత్మవిశ్వాసంతో ఎదిరించి తన ఉనికిని చాటుకుంటుంది. బుల్లితెరపై 'టాక్ ఆఫ్ ది టౌన్' ప్రోగ్రాం కు యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత 'సందడే సందడి', 'బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర, బ్లాక్, కో అంటే కోటి, నవీన, చేతన, స్టార్ మా పరివార్' ఇలా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి, బుల్లితెర చిన్న స్క్రీన్ పై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ ఝాన్సీ. అలాగే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించింది.

Anchor jhansi career and personal Life jhansi special exclusive interview

ఇక బుల్లి తెరపై వచ్చిన ఫేమ్ తో వెండి తెరపై అడుగుపెట్టింది. 'ఎగిరే పావురమా' అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. ఇటీవల నారప్ప, వాల్తేరు వీరయ్య, ఎఫ్ 2, మల్లేశం వంటి పలు సినిమాలతో తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది యాంకర్ ఝాన్సీ. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ 'తులసి' సినిమాలో 'కోకాపేట కనకం' అనే పాత్రలో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నటించి నేటికీ గుర్తుండిపోయేలా చేసింది.

అయితే.. ఝాన్సీ తన సినీకెరీర్ ను ఎంతో సక్సెస్ పుల్ గా కొనసాగించిన ఝాన్సీ తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం సాఫీగా కొనసాగించ లేకపోయింది. తన వివాహం మూడునాళ్ల మూచ్చట మారింది. తన భార్త, నటుడు జోగి నాయుడుతో విడాకులు తీసుకుంది. భర్తతో విడిపోయే సమయానికి ఝాన్సీ కి ఒక కూతురు ఉంది. ఆమె అమ్మయి పేరు ధన్య. ఆ అమ్మాయి కూడా తన తల్లి బాటలోనే సినిమాల్లోకి రావడానికి సిద్ధం అవుతోంది. తాజాగా ఝాన్సీ ఫస్ట్ టైమ్ తన కూతురు ధన్యతో కలిసి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న కాకమ్మ కథలు అనే టాక్ షోకు హాజ‌రైంది.

More from Filmibeat

Read more about: jogi naidu anchor jhansi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X