అందరి ముందు యాంకర్ మంజూషకు అవమానం.. మధ్యలో నీగోలేంటి అంటూ రాజేంద్ర ప్రసాద్ అసహనం!

యాంకర్ మంజూష గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో కొన్ని సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు పూర్తిగా యాంకర్ గా మారి ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సినిమా ఈవెంట్లు కవర్ చేస్తోంది. వయసు పెరుగుతున్నా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా హాట్ ఫోటోలు, వీడియోలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. అలాంటి ఆమెకు ఒక అవమానకర ఘటన ఎదురైంది. దీంతో కాస్త చిన్నబుచ్చుకున్న ఆమె వెంటనే స్టేజ్ నుంచి కిందకు వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

 కలెక్షన్లు కూడా

కలెక్షన్లు కూడా

వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన F3 సినిమా ఈ సినిమా మే 27వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అలాగే రివ్యూలు కూడా కొన్ని బాగున్నాయి అని కొన్ని బాలేదని వచ్చాయి. అయితే ఆడియన్స్ మాత్రం సినిమాకు మంచి స్పందన కనబరుస్తున్నారు కలెక్షన్లు కూడా గట్టిగానే వస్తున్నాయి.

మధ్యలో నీ గోల ఏంటి

మధ్యలో నీ గోల ఏంటి


ఈ నేపథ్యంలోనే తాజాగా F3 సినిమా యూనిట్ ఒక గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఫన్ రైడ్ సెలబ్రేషన్స్ అంటూ చేసిన ఈవెంట్ మొత్తాన్ని యాంకర్ మంజూష తన భుజాల మీద వేసుకొని నడిపించింది. అయితే ఈ ఈవెంట్ లో భాగంగా రాజేంద్రప్రసాద్ ఎంట్రీ కాస్త విభిన్నంగా జరిగింది. ఎందుకంటే F3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఈ సినిమా హిట్ కాకపోతే తన మొహం చూపించనని రాజేంద్రప్రసాద్ శపధం చేశారు.

మధ్యలో నీ గోల ఏంటి

మధ్యలో నీ గోల ఏంటి


ఈ నేపథ్యంలో మొహానికి ఖర్చీఫ్ కట్టుకొని వచ్చిన ఆయన ముందుగ శపధం చేసిన వీడియో చూపించిన తర్వాత స్టేజ్ ఎక్కారు.స్టేజి మీదకు వచ్చిన తర్వాత సరే ఇక మాస్క్ తియ్యండి అంటూ ఇంకేదో మాట్లాడడానికి మంజూష ప్రయత్నించడంతో రాజేంద్రప్రసాద్ అసహనానికి గురయ్యాడు. ఉండవమ్మా నీ గోల ఏంటి ఇక్కడ మా గోల ఎక్కువయింది అంటే మధ్యలో నీ గోల ఏంటి అని అనడంతో తొలుత సరదాగా అన్నారు అని అనుకుంది.

సోమవారం నాడు కూడా

సోమవారం నాడు కూడా


కానీ ఆయన సీరియస్ గానే అన్నారని అర్ధం అయిన తర్వాత వెంటనే ఆమె స్టేజ్ దిగేసి కిందకు వచ్చేసింది. ఇక రాజేంద్రప్రసాద్ ఎప్పటిలాగే మాట్లాడుతూ ఈ సినిమా హిట్ కాకపోతే నా మొహం ఎవరికీ చూపించను, అన్నానని కానీ ఇప్పుడు చూపిస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటి అంటే సినిమా హిట్ అయింది అని చెప్పుకొచ్చాడు. సోమవారం నాడు కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి అంటే సినిమా హిట్ కాక ఇంకేంటి అని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.

హాట్సాఫ్

హాట్సాఫ్


నవ్వును నమ్ముకునే 45 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నానని ఆ నవ్వు ఎప్పటికీ తనను ఇబ్బంది పెట్టదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలో నలు మూలల నుంచి కూడా ఈ సినిమా గురించి ఫోన్స్ వస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ అని ప్రూవ్ చేసిన మా అబ్బాయి అనిల్ రావిపూడి కి హాట్సాఫ్ అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X