డబ్బులిస్తే రాత్రికి వస్తారా? బీరు, విస్కీ.... యాంకర్ రష్మి నుంచి ఊహించని సమాధానం!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్ రష్మి తనకు ఖాళీ సమయం దొరికితే ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది. ఫ్యాన్స్ ఎలాంటి ప్రశ్నలు అడిగినా విసుక్కోకుండా బోల్డ్‌గా రిప్లై చెప్పడం రష్మి స్టైల్. మంగళవారం అభిమానులతో చాట్ చేసిన రష్మికి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి రష్మి మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్స్ ఇచ్చింది.
కొందరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగితే...మరికొందరు సినిమాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నించారు. డబ్బులిస్తే రాత్రికి వస్తారా? అంటూ కొందరు ప్రశ్నించగా దానికి రష్మి నుంచి ఊహించని సమాధానం వచ్చింది.

పెళ్లికంటే ముందు బేబీ కావాలి
2018 కూడా అయిపోతోంది... మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు రష్మి స్పందిస్తూ.... నాకు పెళ్లి కంటే ముందు బేబీ కావాలి, త్వరలోనే అది జరుగుతుంది అని భావిస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చింది రష్మి.

రాత్రికి రమ్మంటే....
ఎవరైనా మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి రాత్రికి రమ్మంటే మీరు ఏం చేస్తారు? అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ ‘అది అడిగే వ్యక్తిపై ఆధార పడి ఉంటుంది' అన్నారు.

దత్తత తీసుకుంటాను
పెళ్లికి ముందే మీరు బేబీని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా ఏమిటి? అనగా.... రష్మి అవును అని సమాధానం ఇచ్చారు. తన ఫేవరెట్ డిష్ పచ్చి పులసు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

రాజమౌళి గొప్పా? శంకర్ గొప్పా?
రాజమౌళి, శంకర్... ఈ ఇద్దరిలో ఉత్తమ చిత్రాలు, ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమాలు తీసేది ఎవరు? అంటే ‘శంకర్ సర్' అని రిప్లై ఇచ్చారు రష్మి. అవకాశం వస్తే బాలీవుడ్లోకి వెళతాను అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

మహేష్ బాబుతో డేట్
మహేష్ బాబుతో డేట్‌కు వెళ్లినట్లు కలలు కన్నారా? అనే ప్రశ్నకు రష్మి సమాధానం ఇస్తూ ఏమో నాకు గుర్తు లేదు. ప్రస్తుతం నా ఫాంటసీలో ఉన్నది ఆక్వామ్యాన్ అని తెలిపారు.

అలా పిలిస్తే అసహ్యం
తనను ఎవరైనా రష్మి అని కాకుండా రేష్మి అని పిలిస్తే అసహ్యం వేస్తుందని..... అయితే ఇపుడు అలాంటివి పెద్దగా పట్టించుకోడం లేదని తెలిపారు.

నాగబాబు టెడ్డీబేర్, స్వీట్ హార్ట్
నాగబాబు, రోజా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..... నాగబాబు సర్ టెడ్డీబేర్, రోజా మేడమ్ స్వీట్ హార్ట్ అని రష్మి చెప్పుకొచ్చారు.

సెక్సువల్ రిలేటెడ్ అంశాలకు ఆదరణ ఎక్కువ
రాత్రికి వస్తారా? అలాంటి ప్రశ్నలకు మీరు బోల్డ్ ఆన్సర్ ఇచ్చారు. ఇలాంటి విషయాలను మీరు లైట్ తీసుకుంటారా? అని ఓ అభిమాని ప్రశ్నంచగా.... సెక్సువల్ రిలేటెడ్ అంశాలకు ఆదరణ ఎక్కువ, అందుకే మొహమాట పడకుండా సమాధానం ఇచ్చాను అని రష్మి తెలిపారు.

అఖిల్ అక్కినేని మీద స్పందించను
అఖిల్ అక్కినేని గురించి స్పందించాలని ఒక అభిమాని ప్రశ్నంచగా..... ఈ ప్రశ్నపై నేనే స్పందించను అని రష్మి సమాధానం ఇచ్చారు.

వింటర్లో విస్కీ, సమ్మర్లో బీర్
మీరు ఏ డ్రింక్ ఇష్టపడతారు అని ఓ వ్యక్తి అడగా..... సమ్మర్లో బీర్ ఇష్టపడతాను, వింటర్లో విస్కీ ఇష్టపడతాను అని రష్మి తెలిపారు.

అందుకే స్మోక్ చేయను
మీరు స్మోక్ చేస్తారా? అనే ప్రశ్నకు రష్మి స్పందిస్తూ..... చేయను, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు, స్కిన్ కూడా పాడవుతుంది అన్నారు.


Click it and Unblock the Notifications











