twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పీరియడ్స్ సమస్య.. రోడ్డు మీద పోయలేం కదా: యాంకర్ రష్మి ఫైర్

    |

    భారత దేశపు మొదటి మహిళా ట్రక్ డ్రైవర్, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన... భోపాల్‌కు చెందిన 49 ఏళ్ల యోగితా రఘువంశీ గురించి చేసిన ఓ ట్వీట్ రష్మి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. నిన్ను చూసి మహిళా లోకం గర్వపడుతుంది, ఇలాంటి కఠినమైన పనిలో రాణిస్తున్నందుకు సెల్యూట్ అంటూ ఆ ట్వీట్లో రాసి ఉంది.

    యోగితా రఘువంశీ గురించిన ఈ ట్వీట్ మీద ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ... 'ట్రక్ డ్రైవింగ్ మగాళ్లు ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్నారు. ఈ పని కేవలం మహిళ చేయడం వల్ల పెద్ద అచీవ్మెంట్ ఎలా అవుతుంది' అని వ్యాఖ్యానించగా రష్మి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

    పీరియడ్స్ సమస్య, టాయిలెట్స్ లేవు.. అందుకే ఇది ఎచీవ్మెంట్

    పీరియడ్స్ సమస్య, టాయిలెట్స్ లేవు.. అందుకే ఇది ఎచీవ్మెంట్

    ‘‘మహిళలు ఎదుర్కొనే పీరియడ్స్, యూటిఐ(యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్)తోడు మన దేశంలో సరైన టాయిలెట్స్, సానిటేషన్ వ్యవస్థ లేదు. మహిళలు రోడ్డు పక్కన మూత్రవిసర్జన చేయలేరు కదా.. ఒక వేళ చేస్తే కొన్ని సందర్భాల్లో వారు రేప్ విక్టిమ్‌గా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ ట్రక్ డ్రైవింగ్ చేయడం అచీవ్మెంటే' అని రష్మి ఘాటుగా సమాధానం ఇచ్చారు.

    మహిళలకు సానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి, మగాళ్లకు లేవు కదా...

    మహిళలకు సానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి, మగాళ్లకు లేవు కదా...

    రష్మి వ్యాఖ్యలపై సదరు నెటిజన్ స్పందిస్తూ... అది బయోలాజిక్ సమస్య. అందుకే వారి కోసం సానిటరీ పాడ్స్ ఉన్నాయి. ఇప్పటికీ మగాళ్ల కోసం సానిటరీ ప్యాడ్స్ డిజైన్ చేయబడలేదు. ఆ విషయంలో మహిళలకంటే మగాళ్లకే ఇబ్బంది ఎక్కువ. ట్రక్ డ్రైవింగ్ లాంటి కఠినమైన ఉద్యోగాలు పురుషులు చేసినా, మహిళలు చేసినా గ్రేటే. ఇద్దరికీ కాంప్లిమెంట్ ఇవ్వండి' అని వ్యాఖ్యానించారు.

    ప్యాడ్స్ ఉంటే సమస్యలు తొలగిపోయినట్లు కాదు

    ప్యాడ్స్ ఉంటే సమస్యలు తొలగిపోయినట్లు కాదు

    రష్మి రియాక్ట్ అవుతూ... ‘మగాళ్లకు ప్యాడ్స్ అవసరం లేదు. ఇద్దరి విషయంలోనూ లింగసమానత్వం పాటించాల్సిందే.. కానదనడం లేదు. కానీ ట్రక్ డ్రైవింగ్ లాంటి జాబ్స్ మొదట పురుషులకు మాత్రమే ఇచ్చేవారు. అనువైన పరిస్థితులు లేకున్నా మహిళలు ఇందులోకి రావడం ఎంకరేజ్ చేయాల్సిన విషయం. కేవలం సానిటరీ ప్యాడ్స్ ఉన్నంత మాత్రాన వారి కష్టాలు తొలగిపోయినట్లే అని మాట్లాడవద్దు.' అని చెప్పుకొచ్చారు.

    సానిటరీ ప్యాడ్స్ కనిపెట్టింది మగాళ్లే

    సానిటరీ ప్యాడ్స్ కనిపెట్టింది మగాళ్లే

    రష్మికి మళ్లీ కౌంటర్ ఇస్తూ... ‘సానిటరీ ప్యాడ్స్ కనిపెట్టింది మగాళ్లే. ఆ విషయం మీరు మరిచిపోవద్దు. మహిళల విషయంలో చిన్న చూపు ఉంటే అలా జరిగేదా? ఆడవారినైనా, మగవారినైనా సమానంగా చూడండి' అంటూ సదరు వ్యక్తి రష్మితో వ్యక్తి వాదనకు దిగారు.

    గొడవ ముగించిన రష్మి

    గొడవ ముగించిన రష్మి

    ఇద్దరి మధ్య వాదోప వాదాల అనంతరం... చివరకు రష్మి ఈ గొడవకు ముగింపు పలికింది. మగాళ్లు మాట్లాడేపుడు జాగ్రత్తగా ఉండాలి అని సూచించింది. రష్మికి, సదరు నెటిజన్ మధ్య జరిగిన వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

    English summary
    "PERIODS, UTI (urinary track infection), Lack of sanitation and proper toilets, Cause u know rite women can’t just pee on the roads cause if they do they end up being rape victims. Plus the guilty of leaving ur children behind when u embark on such journey." Rashmi tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X