twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్ అందుకే నా చేయి పట్టుకున్నాడు, నా అందం క్రీమ్ లాంటిది: రష్మి

    By Bojja Kumar
    |

    Recommended Video

    Anchor Rashmi Gautam Speech@Anthaku Minchi Movie Lyrical Song Release

    జై ,రష్మీ గౌతమ్ జంటగా జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అంతకు మించి'. ఈ చిత్ర టైటిల్ లిరికల్ సాంగ్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా స్టేజీ వద్ద చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి రష్మి వివరణ ఇచ్చారు. ఇపుడు ఈ విషయంలో తాను వివరణ ఇవ్వకపోతే యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వస్తాయని, దాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదనే తాను ఈ వివరణ ఇస్తున్నట్లు తెలిపారు.

     డైరెక్టర్ నా చేయి పట్టుకున్నాడంటూ ట్రోల్ చేస్తారు

    డైరెక్టర్ నా చేయి పట్టుకున్నాడంటూ ట్రోల్ చేస్తారు

    దర్శకుడి గురించి మాట్లాడే ముందు... ఇక్కడ జరిగిన ఓ చిన్న సంఘటన గురించి చెప్పాలి. ఆ క్లారిటీ ఇప్పుడే ఇచ్చుకోవాలి. లేకపోతే మా గురించి యూట్యూబ్‌లో ఎలా ప్రచారం చేస్తారో నాకు తెలుసు. హీరోయిన్ చేయి పట్టుకున్న డైరెక్టర్, హీరోయిన్‌ను బ్రతిమిలాడుతున్న డైరెక్టర్... అంటూ ట్రోల్ చేస్తారు.

    అందుకే నా చేయి పట్టుకున్నాడు

    అందుకే నా చేయి పట్టుకున్నాడు

    డైరెక్టర్‌గారి కంటే నా ఇంటరాక్షన్ ఎక్కువగా మా అసోసియేట్ డైరెక్టర్ మధుగారితో ఉండేది. ఎందుకంటే డైరెక్టర్ గారు సీన్స్ పరంగా ఎప్పుడూ ఏదో ఒక లోకంలో ఉండేవారు. ఇండస్ట్రీలో డైరెక్టర్ రికమండేషన్ అయితే విన్నాము. కానీ ఫస్ట్ టైమ్ ఈ స్టేజీ మీద చూస్తున్నాం. మధుగారు ఇక్కడ యాంకరింగ్ చేస్తారని చెప్పే క్రమంలో నా చేయి పట్టుకున్నారు. అంతకు మించి ఏమీ లేదు. సెట్లో ఎప్పుడూ మధుగారి గొంతు వినిపించేది. థాట్స్ అన్నీ డైరెక్టర్ గారివి అయితే సౌండ్ మాత్రం మధుగారి నుండి వినిపించేది అని రష్మి గుర్తు చేసుకున్నారు.

     పాటలో రష్మి హాట్ లుక్

    పాటలో రష్మి హాట్ లుక్

    తాజాగా విడుదలైన పాటలో రష్మి అందాలు హాట్ హాట్‌గా ప్రదర్శిస్తున్నట్లు చూపించారు. ఈ పాట ఇలా ఉండటంపై రష్మి మాట్లాడుతూ... ఈ పాట కేవలం క్రీమ్ లాంటిది. అసలైన టేస్ట్ సినిమాలోనే ఉంది. జస్ట్ అందం కోసం కేకును డెకొరేట్ చేయడానికి కేక్ పైన క్రీమ్ వేస్తాం, అలాంటిదే ఈ పాట. సినిమాలో చాలా కంటెంట్ ఉంది. ఆగస్టు 24న సినిమా వస్తోంది అందరికీ నచ్చుతుందన్నారు.

    అంతకు మించి

    అంతకు మించి

    జై, రష్మీ గౌతమ్, అజయ్ ఘోష్, టి‌ఎన్‌ఆర్, మధునందన్, హర్ష, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మోహన్ చందా, సినిమాటోగ్రఫి: పి. బాలిరెడ్డి, ఎడిటర్: క్రాంతి(ఆర్ కె), సంగీతం: సునీల్ కశ్యప్, ఆర్ట్: నాగు, కొరియోగ్రాఫర్: సుధీర్ కుమార్, ఫైట్స్ (రామ్ సుంకర), కో-డైరెక్టర్: ఎ. మధుసూధన్‌రెడ్డి, సంపత్ రుద్రారపు, ఇనుముల ఉమామహేశ్వరరావు, కో- ప్రొడ్యూసర్స్: భాను ప్రకాష్ తేళ్ల, కన్నా తిరుమనాధం, నిర్మాత: సతీష్, ఎ. పద్బనాభ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: జానీ.

    English summary
    Anchor Rashmi Gautam revealing the director's action behind her she made funny comments on trolls on social media making it a big issue. She said, she had more interacted with associate director Madhu than the director of the movie. She stated that the thoughts of the director were voiced by Madhu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X