For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నక్క తోక తొక్కిన రష్మి.. ఇక రచ్చ మామూలుగా ఉండదుగా.. వాళ్లకి పూనకాలు అంతే!

  |

  తెలుగు వారిలో యాంకర్ రష్మీ అంటే తెలియని వారు ఉండరు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో అంత పాపులారిటీ సంపాదించింది రష్మీ. ప్రస్తుతం రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్, డీ షో లు చేస్తున్న ఆమె అవి కాకుండా ఈ టీవీ చేసే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ భామ అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉండేఈ భామకు ఒక బంపర్ ఆఫర్ తగిలినట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  గ్లామర్ షో

  గ్లామర్ షో

  ముందు నుంచి కూడా రష్మీ వెండితెర మీద నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కంటే గ్లామర్ షో, అందాల ఆరబోతకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ అలాంటి పాత్రలే చేస్తూ వచ్చింది. అలాంటి పాత్రలు చేస్తే మరింత క్రేజ్ లభిస్తుందని భావించింది ఏమో కానీ ఆమె ఎంత అందాలు ఆరబోసినా సరే ప్రేక్షకులు బుల్లితెర మీద ఆదరించినంత బాగా వెండితెర మీద అయితే ఆదరించలేదు.

  బుల్లితెర మీద

  బుల్లితెర మీద

  అలా ఆమె సినిమాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క ఫలితం కూడా దక్కలేదు. అయితే బుల్లితెర మీద కనిపిస్తే మాత్రం ప్రేక్షకులు ఆమెను ఆదరించారు. ఆమె చేస్తున్న అన్ని షోలకు మంచి టిఆర్పిలు, వీడియో లకు మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉండే ఆమెకు సోషల్ మీడియాలో క్రేజ్ బాగానే ఉంది.

  యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా

  యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా

  ఈ భామకు ఒక లక్కీ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. విషయం ఏంటంటే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతోన్న 'భోళా శంకర్‌' అనే సినిమాకు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రష్మి కూడా నటిస్తుందని అదే రోజు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

  మాస్‌ డ్యాన్స్‌

  మాస్‌ డ్యాన్స్‌

  అయితే తాజా సమాచారం ప్రకారం.. 'భోళాశంకర్‌'లో మాస్‌ డ్యాన్స్‌ ఉంటే బాగుంటుందని.. అందులోనూ చిరు డ్యాన్స్‌ చేస్తే థియేటర్‌ దద్దరిల్లి పోతుందని చిత్రబృందం భావించి ఒక మాస్ నంబర్ సిద్ధం చేస్తున్నారట. ఈ మేరకు సంగీత దర్శకుడితో కలిసి ఓ మాస్‌ సాంగ్‌కి సన్నాహాలు చేస్తోండగా అదే ఇప్పుడు రష్మీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

   నిజమైతే బంపర్‌ ఆఫర్‌ తగిలినట్లే

  నిజమైతే బంపర్‌ ఆఫర్‌ తగిలినట్లే

  అదేంటంటే ఆ మాస్ నంబర్ లో రష్మీ చిరుతో కలిసి స్టెప్పులేయనున్నట్టు చెబుతున్నారు. అంతే కాదు టాలీవుడ్ లో లీడింగ్ లో ఉన్న శేఖర్‌ మాస్టర్‌ ఈపాటకు కొరియోగ్రఫీ చేయనున్నారని నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారమే కనుక నిజమైతే రష్మికి బంపర్‌ ఆఫర్‌ తగిలినట్లే అని అంటున్నారు.

  Recommended Video

  #Spirit : ఆ సినిమా బడ్జెట్‌లో సగం ప్రభాసే తీసుకుంటున్నాడట! || Filmibeat Telugu
   ఆమెకు అదృష్టమే

  ఆమెకు అదృష్టమే


  శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్న మాస్‌ సాంగ్‌లో రష్మికి అవకాశం రావడం ఒకరకంగా ఆమెకు అదృష్టమేనని సినీ జనాలు నమ్ముతున్నారు.ఇక తమిళ వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో చిరు సోదరిగా కీర్తిసురేశ్‌ నటించనున్నారు. ఇక చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది.

  English summary
  Anchor Rashmi got a chance to dance with megastar chiranjeevi in bola Shankar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X