Sreemukhi అదిరిపోయే గ్లామర్ ట్రీట్: స్లీవ్‌లెస్ బ్లౌస్‌తో అందాల విందు!

శ్రీముఖి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై సందడి చేస్తోంది. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక, సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ రచ్చ రచ్చ చేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీముఖి స్లీవ్‌లెస్ బ్లౌస్‌తో అందాల విందు చేసింది. ఆ సంగతులు మీకోసం!

సినిమా నటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి

సినిమా నటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి

స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోన్న శ్రీముఖి.. ముందుగా సినీ నటిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన 'జులాయి' అనే సినిమాతో నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో లీడ్ రో‌ల్‌తో మెప్పించింది.

ఆ షోతో యాంకర్‌గా మారిన అమ్మడు

ఆ షోతో యాంకర్‌గా మారిన అమ్మడు

నటిగా తెలుగు వాళ్లకు పరిచయం అయిన శ్రీముఖి.. ఆ తర్వాత 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస షోలతో బుల్లితెరపై తన హవాను చూపించింది. ఆమె సుదీర్ఘమైన కెరీర్‌లో 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలతో పాటు కొన్ని ఈవెంట్లనూ హోస్ట్ చేసింది.

బిగ్ బాస్ తర్వాత ఫుల్ జోష్‌తో బ్యూటీ

బిగ్ బాస్ తర్వాత ఫుల్ జోష్‌తో బ్యూటీ

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీముఖి.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ మూడో సీజన్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ.. రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. కానీ, ఈ షో వల్ల తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా భారీగా అందుకుంటోంది. దీంతో షో తర్వాత ఈ అమ్మడు ఫుల్ జోష్‌తో దూసుకుపోతోంది.

ఇప్పుడు వాటితో బిజీగా రాములమ్మ

ఇప్పుడు వాటితో బిజీగా రాములమ్మ

తనకు గ్లామర్ రోల్స్ మాత్రమే వస్తున్నాయని.. అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నానని శ్రీముఖి చెప్పింది. కానీ, ఈ మధ్య మాత్రం కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో మరోసారి లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ నటిస్తోన్న 'మాస్ట్రో'లో సైతం ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. వీటితో పాటే మరికొన్ని సినిమాల్లో లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో మాత్రం ఎప్పుడూ రచ్చ చేసి

అందులో మాత్రం ఎప్పుడూ రచ్చ చేసి

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం నిత్యం వేలు పెట్టే ఉంచుతోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలతో అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తుండడంతో ఆమె ఫాలోయింగ్ పెరుగుతోంది.

శ్రీముఖి నుంచి అదిరిపోయే గ్లామర్ ట్రీట్

శ్రీముఖి నుంచి అదిరిపోయే గ్లామర్ ట్రీట్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది శ్రీముఖి. ఈ మధ్య ఎక్కువగా గ్లామర్‌తో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. నిత్యం ఏదో ఒక విధంగా అందాల విందు చేస్తోన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి అదే పని చేసింది. తాజాగా శ్రీముఖి ఓ ప్రాంతానికి టూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె నల్లరంగు చీరలో అందాలు ఒలకబోస్తూ గ్లామర్ ట్రీట్ చేసింది.

Recommended Video

Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
స్లీవ్‌లెస్ బ్లౌస్‌తో అందాల విందు చేస్తూ

స్లీవ్‌లెస్ బ్లౌస్‌తో అందాల విందు చేస్తూ

శ్రీముఖి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె బ్లాక్ శారీ కట్టుకుని కనిపించింది. దీని కాంబినేషన్‌గా అదే కలర్ స్లీవ్‌లెస్ బ్లౌస్ వేసుకుని ఉంది. దీంతో ఆమె అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X