పెళ్లిపై శ్రీముఖి ఊహించని ప్రకటన: వాళ్ల నుంచి ఒత్తిడి.. అందుకే హ్యాపీ అంటూ ఏకంగా అలా కనిపించడంతో!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా పని చేస్తున్నారు. అందులో కొందరు మాత్రమే స్టార్లుగా వెలుగొందుతున్నారు. వారిలో తెలంగాణ పిల్ల శ్రీముఖి ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్‌తో అదరగొడుతోన్న ఈ బ్యూటీ.. టెలివిజన్ రంగంలోనే కాకుండా వెండితెరపైనా సత్తా చాటుతోంది. తద్వారా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలోనే శ్రీముఖి పెళ్లి గురించి తాజాగా ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. దీనికి రాములమ్మ ఊహించని ప్రకటన చేసి క్లారిటీ ఇచ్చేసింది. ఆ వివరాలు మీకోసం!

అల్లు అర్జున్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది

అల్లు అర్జున్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది

తెలుగులో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దొరకవు. ఒకవేళ వచ్చినా ఎంతో కాలం ఇండస్ట్రీలో ఉండలేదు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'జులాయి'తో శ్రీముఖి నటిగా పరిచయం అయింది. దీని తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్', 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' సహా పలు చిత్రాల్లో మంచి మంచి పాత్రలతో మెప్పించింది.

అదుర్స్ అంటూ అందులోకి అడుగెట్టింది

అదుర్స్ అంటూ అందులోకి అడుగెట్టింది

సినిమాల్లో తన సత్తాను నిరూపించుకన్న శ్రీముఖి.. ఆ తర్వాత బుల్లితెరపైనా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'అదుర్స్' అనే షోతో హోస్టుగా మారిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో కార్యక్రమాలను సక్సెస్‌ఫుల్‌గా నడిపించింది. 'పటాస్' ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది.

బిగ్ బాస్ షాక్.. కెరీర్‌కు మాత్రం బూస్టు

బిగ్ బాస్ షాక్.. కెరీర్‌కు మాత్రం బూస్టు

సుదీర్ఘమైన కెరీర్‌లో 'పటాస్' అనే షో శ్రీముఖిని బిగ్ సెలెబ్రిటీని చేసేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ షోకు గుడ్‌బై చెప్పేసిన ఈ బ్యూటీ.. రెండేళ్ల క్రితం ప్రసారం అయిన 'బిగ్ బాస్' మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన ఈమె రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ షో ఆమెకు నిరాశనే మిగిల్చినా.. అప్పటి నుంచి వరుస ఆఫర్లతో కెరీర్ మారిపోయింది.

ఇప్పుడా ప్రాజెక్టులు.. సినిమా ఫంక్షన్లు

ఇప్పుడా ప్రాజెక్టులు.. సినిమా ఫంక్షన్లు


బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి ఫుల్ బిజీ అయిపోయింది. వరుసగా సినిమా ఫంక్షన్ల‌ను హోస్ట్ చేయడంతో పాటు సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తోంది. అదే సమయంలో లూవీ అనే బిజినెస్‌ను కూడా ప్రారంభించింది. అంతేకాదు, ప్రస్తుతం సత్తిబాబు తెరకెక్కిస్తున్న 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ కొత్త చిత్రం 'మాస్ట్రో'లోనూ చాన్స్ పట్టేసిందీ బ్యూటీ.

అందులో ఫుల్ బిజీగా.. యమ ఫేమస్

అందులో ఫుల్ బిజీగా.. యమ ఫేమస్

వరుస షోలు.. సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌లోని విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దీంతో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంటోందామె.

వివాహంపై శ్రీముఖికి ఊహించని ప్రశ్న

వివాహంపై శ్రీముఖికి ఊహించని ప్రశ్న

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా తన ఫాలోవర్లు అడిగిన ఎన్నో రకాల ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆమెను 'మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము' అని ఊహించని ప్రశ్న అడిగాడు.

Recommended Video

Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
వాళ్ల నుంచి ఒత్తిడి.. హ్యాపీ అంటూ అలా

వాళ్ల నుంచి ఒత్తిడి.. హ్యాపీ అంటూ అలా

నెటిజన్ అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ.. 'నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. మా అమ్మా నాన్న నుంచి ఎలాంటి ఒత్తడి లేదు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. హ్యాపీ ఉగాది' అంటూ బదులిచ్చింది శ్రీముఖి. ఇందుకోసం ఆమె స్పెషల్ ఫిల్టర్‌ను వాడడంతో భయంకరంగా కనిపించింది. దీంతో ఈ స్క్రీన్ షాట్లు ఇంటర్నెట్‌లో వైరల్ అయిపోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X