డేటింగ్‌పై శ్రీముఖి సెన్సేషనల్ కామెంట్స్: అతడు ప్రపోజ్ చేయగానే.. ఆ వీడియో పోస్ట్ చేసిన బ్యూటీ

దాదాపు ఐదారేళ్లుగా తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా తన హవాను చూపిస్తూ దూసుకుపోతోంది గ్లామరస్ క్వీన్ శ్రీముఖి. నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్తోంది. వరుస ఆఫర్లను అందుకోవడమే కాదు.. భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఎంతో మందికి క్రష్‌గా మారిపోయింది. ఇలాంటి సమయంలో తాజాగా జరిగిన ఓ ఇంటరాక్షన్‌లో శ్రీముఖి తన డేటింగ్ గురించి కామెంట్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అలా మొదలైన కెరీర్.. అప్పుడే ఫేమస్

అలా మొదలైన కెరీర్.. అప్పుడే ఫేమస్

అల్లు అర్జున్ నటించిన 'జులాయి' అనే సినిమాతో నటిగా కెరీర్‌ను ఆరంభించింది నిజామాబాద్ పిల్ల శ్రీముఖి. ఆ సినిమాలో మెప్పించడంతో ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. ఈ క్రమంలోనే 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో లీడ్ రో‌ల్‌తో ఆకట్టుకుంది.

యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ

యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ

నటిగా బిజీగా ఉన్న సమయంలోనే శ్రీముఖి 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా పరిచయం అయింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసే పరిస్థితే రాలేదు. అంతలా వరుస షోలతో సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలతో పాటు స్పెషల్ ఈవెంట్లనూ చేసి మెప్పించింది.

బిగ్ బాస్‌తో రెట్టింపు... వరుస ఆఫర్లతో

బిగ్ బాస్‌తో రెట్టింపు... వరుస ఆఫర్లతో

వరుస షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పుడే శ్రీముఖికి బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. అందులోకి టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తుది మెట్టుపై బోల్తా పడింది. ఫలితంగా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితేనేం తెలుగు రాష్ట్రాల్లో తనకున్న క్రేజ్‌ను మాత్రం భారీగా పెంచుకుంది. ఫలితంగా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

 ఇప్పుడా సినిమాలు.. శ్రీముఖి హవానే

ఇప్పుడా సినిమాలు.. శ్రీముఖి హవానే

బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి హవా మరింతగా పెరిగిపోయింది. ఇందులో భాగంగానే ఇప్పుడు వరుస షోలు, సినిమా ఫంక్షన్లు తదితర కార్యక్రమాలతో దూసుకెళ్తోంది. అదే సమయంలో 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో మరోసారి లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ నటిస్తోన్న 'మాస్ట్రో'లో సైతం ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. వీటితో పాటే మరికొన్ని సినిమాల్లో లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడా సినిమాలు.. శ్రీముఖి హవానే

ఇప్పుడా సినిమాలు.. శ్రీముఖి హవానే

బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి హవా మరింతగా పెరిగిపోయింది. ఇందులో భాగంగానే ఇప్పుడు వరుస షోలు, సినిమా ఫంక్షన్లు తదితర కార్యక్రమాలతో దూసుకెళ్తోంది. అదే సమయంలో 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో మరోసారి లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ నటిస్తోన్న 'మాస్ట్రో'లో సైతం ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. వీటితో పాటే మరికొన్ని సినిమాల్లో లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 అతడు ప్రపోజ్ చేయగానే.. ఆ వీడియో

అతడు ప్రపోజ్ చేయగానే.. ఆ వీడియో

తాజాగా శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతలో ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించింది. ఇందులో నెటిజన్లు వింత వింత ప్రశ్నలతో ఆమెకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలోనే కొందరు ఆమెకు ప్రపోజ్ చేశారు. ఓ నెటిజన్ 'మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా' అని అడిగాడు. దీనికి శ్రీముఖి 'మన్మథుడు' సినిమాలోని వద్దురా సోదరా అనే పాట వీడియోను పోస్ట్ చేసింది.

Recommended Video

Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
డేటింగ్‌పై శ్రీముఖి సెన్సేషనల్ కామెంట్స్

డేటింగ్‌పై శ్రీముఖి సెన్సేషనల్ కామెంట్స్

ఆ తర్వాత మరో నెటిజన్ 'మీరు ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? చాలా మందికి ఈ డౌట్ ఉంది. క్లారిటీ ఇస్తే మేమంతా హ్యాపీ' అంటూ అడిగాడు. దీనికి శ్రీముఖి 'లేదండీ బాబు నన్ను నమ్మండి' అంటూనే ఛత్రపతి సినిమాలోని ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా అనే వీడియోను పెట్టింది. అలాగే, పెళ్లి ఎప్పుడని అడగగా.. వింత వింత ఆన్సర్లు ఇచ్చిందామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X