Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
క్లీవేజ్ షోతో మంట పెడుతోన్న శ్రీముఖి: చీర కొంగును తప్పించి.. అందాలను చూపిస్తూ రాములమ్మ రచ్చ
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా తమ సత్తాను చూపించుకుంటున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ అండ్ హాట్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. దాదాపు దశాబ్ద కాలంగా టెలివిజన్ రంగంలో తనదైన శైలి హోస్టింగ్‌తో దూసుకుపోతోందీ అమ్మడు. తద్వారా ఎన్నో అవకాశాలను అందుకుంటోంది. అదే సమయంలో వెండితెరపైనా తన మార్క్ చూపించే ప్రయత్నాలు చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా దూసుకుపోతోన్న ఈ అమ్మడు.. తాజాగా క్లీవేజ్ హాట్ ఫొటోషూట్‌లో రెచ్చిపోయింది. ఏకంగా చీర కొంగును తప్పించి అందాలను ప్రదర్శించింది. ఆ వివరాలు మీకోసం!
అల్లు అర్జున్‌తోనే మొదలు పెట్టిన శ్రీముఖి
తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్లో అవకాశాలు అంతగా లభించవు అన్న నానుడిని అబద్ధం చేస్తూ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'జులాయి'తో నటిగా పరిచయం అయిన ఈ అమ్మడు.. ఆ సినిమాతో ఆకట్టుకుంది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్మెన్', 'బాబు బాగా బిజీ' సహా పలు చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసింది.
అదుర్స్ అంటూ అందులోకి ఎంట్రీ ఇచ్చింది
నటిగా సినిమాల్లో అవకాశాలు వస్తోన్న సమయంలోనే 'అదుర్స్' అనే షోతో శ్రీముఖి యాంకర్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని వరుస ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్‌గా చేసిందామె.
ఆ ఒక్క షో పైకి లేపింది.. విమర్శలు కూడా
సుదీర్ఘమైన కెరీర్లో శ్రీముఖి ఎన్నో షోలకు హోస్టుగా చేసింది. కానీ, వాటన్నింటిలో 'పటాస్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి కారణం అందులో యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన హడావిడే. అంతేకాదు, అందులో ఈ లేడీ యాంకర్ వ్యవహరించిన తీరు అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దీంతో ఆమెపై విమర్శలొచ్చాయి. అలాగే, 'పటాస్'ను నిషేదించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి.
సినిమాలకు దూరం... దాని తర్వాత మళ్లీ
సక్సెస్ఫుల్ షో బిగ్ బాస్ మూడో సీజన్లో శ్రీముఖి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఈ అమ్మడు.. రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ షో తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం సత్తిబాబు తెరకెక్కిస్తున్న 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ చిత్రంలోనూ చాన్స్ పట్టేసింది.
ఎప్పుడూ అందులోనే.. హాట్ షోతో సెగలు
వరుస షోలు.. సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌లోని విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దీంతో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంటోందామె.
క్లీవేజ్ షోతో మంట పెడుతోన్న రాములమ్మ
ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటోంది శ్రీముఖి. మరీ ముఖ్యంగా ఆమె హాట్ షో కారణంగా ఎన్నో సార్లు హైలైట్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ యాంకరమ్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షోతో మంట పెడుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
చీర కొంగును తప్పించి.. అందాలను చూపిస్తూ
ఈ ఫొటోలలో శ్రీముఖి బ్లాక్ శారీ కట్టుకుని ఉంది. అంతేకాదు, ఆ చీర కొంగును పక్కకు తప్పించి ఎద అందాలను కనువిందు చేస్తోంది. దీంతో ఈ పిక్స్‌కు చాలా తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. నెటిజన్లతో పాటు సెలెబ్రిటీలు సైతం వీటికి కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో లైకులు కూడా పెడుతున్నారు. దీంతో ఈ ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అయిపోయాయి.