బట్టలు లేని ఫోటో పెట్టమని శ్రీముఖికి నెటిజన్ రిక్వెస్ట్: ‘నగ్నం’ పిక్ పెట్టి షాకిచ్చిన యాంకర్

శ్రీముఖి.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. దీనికి కారణం దాదాపు ఏడెనిమిదేళ్లుగా బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా మెరుస్తూ సందడి చేస్తుండడమే. నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. యాంకర్‌గా స్థిరపడిపోయిందీ బ్యూటీ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను చేరుకున్న రాములమ్మ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తద్వారా ఎన్నో ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఆమెకు వింత అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

అదుర్స్‌ నుంచి పటాస్ వరకు అదరగొట్టింది

అదుర్స్‌ నుంచి పటాస్ వరకు అదరగొట్టింది

'అదుర్స్' అనే షో ద్వారా బుల్లితెరపైకి యాంకర్‌గా ప్రవేశించింది శ్రీముఖి. అందులో తనదైన శైలి హోస్టింగ్‌తో ఆకట్టుకోవడంతో ఆమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో షోలు చేసింది. ఇక, రాములమ్మ కెరీర్‌లోనే 'పటాస్' షో ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే.

సినిమాల్లోనూ సత్తా.. నటిగా మంచి పేరుతో

సినిమాల్లోనూ సత్తా.. నటిగా మంచి పేరుతో

యాంకర్‌గా స్థిరపడడానికి ముందే శ్రీముఖి కొన్ని సినిమాల్లో నటించింది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన 'జులాయి'తో నటిగా పరిచయం అయిన ఆమె.. సుదీర్ఘ కాలంలో 'నేను శైలజ', 'జెంటిల్‌మన్' వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలను పోషించింది. అదే సమయంలో 'బాబు బాగా బిజీ' సహా ఎన్నో చిత్రాల్లో లీడ్ రోల్స్ కూడా చేసింది. తద్వారా నటిగా పేరు తెచ్చుకుంది.

శ్రీముఖి కెరీర్‌లో అదొక్కటే మైనస్ అయింది

శ్రీముఖి కెరీర్‌లో అదొక్కటే మైనస్ అయింది

సినిమాలు.. షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీముఖికి బిగ్ బాస్ షో ఆఫర్ వచ్చింది. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ -3కి కంటెస్టెంట్‌గా వెళ్లింది. ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ కావడంతో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిందామె. కానీ, ఊహించని విధంగా ఈ సీజన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాహుల్ విన్నర్ అయ్యాడు.

ముగ్గురు అంకుల్స్‌తో పాటు నితిన్ సినిమా

ముగ్గురు అంకుల్స్‌తో పాటు నితిన్ సినిమా

ప్రస్తుతం శ్రీముఖి కొన్ని షోలు చేయడంతో పాటు పలు పెద్ద సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే ఈ సత్తిబాబు తెరకెక్కిస్తున్న 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోన్న ఈ భామ.. యంగ్ హీరో నితిన్ చేస్తున్న 'ఆంధాధున్' రీమేక్‌లోనూ నటిస్తోంది. ఈ విషయాన్ని ఇటీవలే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇందులో ఆమె ఓ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గోవాలో రచ్చ రచ్చ.. వ్యాపారం మొదలెట్టింది

గోవాలో రచ్చ రచ్చ.. వ్యాపారం మొదలెట్టింది

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి తరచూ ఏదో ఒక టూర్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంటుంది. ఇటీవలే యాంకర్ విష్ణు ప్రియ, ఆర్జే చైతూ, ముక్కు అవినాష్, ఆరియానాలతో కలిసి గోవా వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ గ్లామర్ షోతో రచ్చ చేసింది. ఇక, వచ్చిన తర్వాత 'లూవీ' అనే కొత్త బిజినెస్‌ను ప్రారంభించింది. ప్రేమికుల రోజు సందర్భంగా దీన్ని లాంఛ్ చేసిందీ గ్లామరస్ యాంకర్.

బట్టలు లేని ఫోటో పెట్టమని నెటిజన్ రిక్వెస్ట్

బట్టలు లేని ఫోటో పెట్టమని నెటిజన్ రిక్వెస్ట్

శ్రీముఖి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ఆమెను ఫాలో అయ్యే వారికి తెలుసు. ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఫాలోవర్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన వాటికి ఫొటోలతో బదులిచ్చింది. దీంతో ఓ ఔత్సాహికుడు బట్టలు లేని ఫోటో పెట్టమని శ్రీముఖికి రిక్వెస్ట్ పెట్టాడు.

‘నగ్నం' పిక్ పెట్టి షాకిచ్చిన యాంకర్ శ్రీముఖి

‘నగ్నం' పిక్ పెట్టి షాకిచ్చిన యాంకర్ శ్రీముఖి

నగ్నంగా ఉన్నప్పటి ఫొటో పెట్టమని కోరిన నెటిజన్‌కు.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'నగ్నం' సినిమా పోస్టర్‌ను పెట్టిన శ్రీముఖి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో శ్రీముఖి తెలివికి ప్రశంసలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X