twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియుడి పేరును బయట పెట్టిన యాంకర్ శ్రీముఖి: తన క్రష్ ఎవరో కూడా రివీల్ చేసిన రాములమ్మ

    |

    ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు బుల్లితెర యాంకర్లు కూడా హీరోయిన్లు మాదిరిగా ఫాలోయింగ్‌ను అందుకుంటున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. చాలా కాలం క్రితమే టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తద్వారా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. వ్యవహార శైలితోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటోందీ భామ. ఇందులో భాగంగానే తాజాగా సోషల్ మీడియాలో నిర్వహించిన లైవ్ చాట్‌లో శ్రీముఖి తన ప్రియుడి పేరును బయట పెట్టింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

    సినీ నటిగా పరిచయం... బన్నీతోనే స్టార్ట్

    సినీ నటిగా పరిచయం... బన్నీతోనే స్టార్ట్

    నటిగా స్థిరపడాలన్న లక్ష్యంతో శ్రీముఖి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే అవకాశాల కోసం చాలా కాలం పాటు ఎదురు చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'జులాయి'తో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్', 'బాబు బాగా బిజీ' సహా పలు చిత్రాల్లో కీలక పాత్రలు చేసి మెప్పించింది.

    యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి

    యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి

    ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. 'అదుర్స్' అనే షోతో శ్రీముఖి యాంకర్‌గా బుల్లితెరపై యాంకర్‌గానూ ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని వరుస ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే సుదీర్ఘమైన కెరీర్‌లో 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో కార్యక్రమాలను నడిపించిందీ భామ.

    ఆ షోతో మారింది.. ఆమెపై విమర్శల వర్షం

    ఆ షోతో మారింది.. ఆమెపై విమర్శల వర్షం

    శ్రీముఖి కెరీర్‌లో 'పటాస్' షో గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. దీనికి కారణం అందులో యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన హడావిడే. స్టాండప్ కామెడీ షోగా ప్రసారం అయిన అందులో ఈ లేడీ యాంకర్ వ్యవహరించిన తీరు అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దీంతో ఆమెపై విమర్శలు కూడా చెలరేగాయి. అంతేకాదు, 'పటాస్'ను నిషేదించాలని కొందరు డిమాండ్లు కూడా వినిపించారు.

    దాని తర్వాత యూటర్న్... అందుకే అలా

    దాని తర్వాత యూటర్న్... అందుకే అలా

    రెండేళ్ల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లింది శ్రీముఖి. అయితే, తుది మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయినప్పటికీ ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో సినిమాల్లో నటించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ సత్తిబాబు తెరకెక్కిస్తున్న 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ చిత్రంలోనూ చాన్స్ పట్టేసింది.

    అక్కడ ఫుల్ బిజీ.. హాట్ షోతో పాపులర్

    అక్కడ ఫుల్ బిజీ.. హాట్ షోతో పాపులర్

    వరుస షోలు.. సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌లోని విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దీంతో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంటోందామె.

    ప్రియుడి పేరును బయట పెట్టిన శ్రీముఖి

    ప్రియుడి పేరును బయట పెట్టిన శ్రీముఖి

    తాజాగా శ్రీముఖి తన ఫాలోవర్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన వాటికి ఫొటోలతో బదులిచ్చింది. ఇందులో భాగంగానే ఓ ఔత్సాహిక నెటిజన్.. 'నీ బాయ్‌ఫ్రెండ్ పేరేంటి' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానం ఇస్తూ.. '420' అనే సంఖ్య ఉన్న ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. దీంతో ఇందులో అర్థం ఏమై ఉంటుందా అని అంతా ఆలోచిస్తున్నారు.

    క్రష్ ఎవరో కూడా రివీల్ చేసిన రాములమ్మ

    క్రష్ ఎవరో కూడా రివీల్ చేసిన రాములమ్మ

    ఇదే సెషన్‌లో మరో నెటిజన్ 'నీ క్రష్ ఎవరు' అంటూ శ్రీముఖిని ప్రశ్నించాడు. దీనికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఫొటోను పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఆమెను బట్టలు లేని ఫోటో పెట్టమని కూడా ఒకరు అడిగిన విషయం తెలిసిందే. దీనికి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'నగ్నం' సినిమా పోస్టర్‌ను పెట్టిన శ్రీముఖి అతడికి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చింది శ్రీముఖి.

    English summary
    Sreemukhi is an Indian actress and television presenter who works in Telugu films. Sreemukhi started her career as a supporting actor in the 2012 film Julai. She made her debut as a lead actress in Prema Ishq Kaadhal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X