అందరి ముందే చిరంజీవికి ఐ లవ్ యూ చెప్పిన శ్రీముఖి.. మెగాస్టార్ సిగ్గుపడి ఏం చేశారంటే
మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా భాటియా, శ్రీముఖి, సుశాంత్ నటించిన భోళా శంకర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ..
మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికి నమస్కారం. భోళా జీ ఐ లవ్ యూ జీ అంటూ చిరంజీవికి సిగ్నల్ ఇచ్చింది. దాంతో సిగ్గుపడిన చిరంజీవి షార్ట్ కాలర్ అడ్డుపెట్టుకొని నవ్వుకొన్నారు. ఆ తర్వాత హైపర్ ఆది మాట్లాడిన తర్వాత ఎవరూ మాట్లాడటం కష్టమే. చిరంజీవి గురించి మాట్లాడటానికి మాటలు చాలవు. నేను కూడా మీలాగ అభిమానినే. కానీ అదృష్టం కొద్ది నాకు చిరంజీవి పక్కన నటించే అవకాశ దక్కింది అని శ్రీముఖి అన్నారు.

భోళా శంకర్ సినిమాలో అవకాశం ఇచ్చిన మెహర్ రమేష్‌కు ధన్యవాదాలు. నన్ను నమ్మినందుకు చాలా ధన్యవాదాలు. నన్ను అందంగా చూపించినందుకు ధన్యవాదాలు. చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయి వచ్చాను. అంతా ఎగిరిపోయింది. అయితే మీరు నేను, మ్యాచింగ్ వేసుకొన్నాం. అది తృప్తిగా ఉంది అని శ్రీముఖి అన్నారు.
నేను చాలా లక్కీ. భోళా శంకర్ చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకొంటున్నాను. మనకు 2జీ, 4జీ, 5జీ ఉంది. ఎన్నీ జీలు తెలిసినా.. నాకు తెలిసింది ఒకే జీ.. అది భోళాజీ. ఐ లవ్ యూ సార్. ఈ సినిమాలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాతోపాటు నటించిన అందరికి థ్యాంక్స్, బెస్టాఫ్ లక్. మరోసారి మెహర్ రమేష్‌కు థ్యాంక్స్ అని శ్రీముఖి తన స్పీచ్‌ను ముగించారు.
భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా ట్రైలర్‌లో శ్రీముఖి చెప్పిన భోళాజీ అనే డైలాగ్ వైరల్ అయింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై నుంచి శ్రీముఖి చాలా హుషారుగా మాట్లాడిన మాటలు అభిమానులను కిక్క్ ఎక్కించాయి.


Click it and Unblock the Notifications











