Sreemukhi Marriage గురించి షాకింగ్ కామెంట్స్: ఇప్పుడదే పనిలో ఉన్నా..అప్పుడే చేసుకుంటానంటూ క్లారిటీ

శ్రీముఖి.. తెలుగు వాళ్లకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా రెండు రాష్ట్రాల్లో సందడి చేస్తూ ప్రేక్షకులను మాయ చేస్తోంది. అదే సమయంలో వరుసగా టీవీ షోలు, సినిమాల్లో కనిపించి తన సత్తాను చాటుకుంటోంది. ఇక, ఈ మధ్య కాలంలో అటు బుల్లితెరపై కానీ.. ఇటు వెండితెరపై కానీ కనిపించని ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో ఈ బ్యూటీ తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

నటిగా మొదలైన శ్రీముఖి ప్రయాణం

నటిగా మొదలైన శ్రీముఖి ప్రయాణం

నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీముఖి అల్లు అర్జున్ నటించిన 'జులాయి'తో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది. అందులో కాసేపే కనిపించినా.. చక్కని నటనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.

అదుర్స్ అంటూ యాంకర్‌గా వచ్చింది

అదుర్స్ అంటూ యాంకర్‌గా వచ్చింది

వరుస సినిమాలతో బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. ఆ తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా జోరందుకుంది. దీంతో వరుసగా షోలు చేస్తూ సత్తా చాటింది. సుదీర్ఘమైన కెరీర్‌లో ఆమె 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలు చేసి గుర్తింపు పొందింది.

యూటర్న్ తీసుకుని.. మూవీస్ చేస్తూ

యూటర్న్ తీసుకుని.. మూవీస్ చేస్తూ

కెరీర్ ఆరంభంలో వరుసగా సినిమాలు చేసిన శ్రీముఖి.. ఆ తర్వాత వెండితెరపై కనిపించడం మానేసింది. ఆ సమయంలో తనకు గ్లామర్ రోల్స్ మాత్రమే వస్తున్నాయని, అందుకే సినిమాలు చేయట్లేదని చెప్పింది. అయితే, ఇప్పుడు మాత్రం ఈ బ్యూటీ ఈ సత్తిబాబు తెరకెక్కిస్తోన్న 'క్రేజీ అంకుల్స్'లో మరోసారి లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ నటిస్తోన్న 'మాస్ట్రో'లో కీలక పాత్ర చేసింది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉన్నా.. శ్రీముఖి మాత్రం ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన అందచందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఆమె ఫాలోవర్లు రోజు రోజుకూ పెరుగుతున్నారు.

ఇన్‌స్టాలో తరచూ అదే పని చేస్తోంది

ఇన్‌స్టాలో తరచూ అదే పని చేస్తోంది


సోషల్ మీడియాలో ఎంతో బిజీగా ఉండే శ్రీముఖి.. అందులో ఎక్కువ శాతం ఇన్‌స్టాగ్రామ్‌కే సమయం కేటాయిస్తోంది. ఇందులో ఆమె గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అందాల విందు చేస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఎక్కువగా తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లను నిర్వహిస్తోంది. ఇందులో తన గురించి, తన ఫ్యామిలీ గురించి వాళ్లు అడిగిన వాటికి బదులిస్తుంది.

పెళ్లి గురించి శ్రీముఖికి నెటిజన్ ప్రశ్న

పెళ్లి గురించి శ్రీముఖికి నెటిజన్ ప్రశ్న

హాట్ యాంకర్ శ్రీముఖి ఇన్‌స్టాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ ఎప్పుడు నిర్వహించినా.. ఎక్కువగా ఎదురయ్యే ప్రశ్న ఆమె పెళ్లి గురించే. ఈ మధ్య కాలంలో ఎంతో మంది నెటిజన్లు ఆమెను 'మీరు ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారా?'.. 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు' అని తరచూ అడుగుతున్నారు. ఇక, తాజాగా నిర్వహించిన సెషన్‌లోనూ ఆమెకు ఓ నెటిజన్ నుంచి అలా ప్రశ్నే ఎదురైంది.

Recommended Video

Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
అప్పుడే చేసుకుంటానంటూ క్లారిటీ

అప్పుడే చేసుకుంటానంటూ క్లారిటీ

తాజాగా ఓ నెటిజన్ 'మేడం మీ పెళ్లి ఎప్పుడు.. మేము వెయిటింగ్' అని అడిగాడు. దీనికి శ్రీముఖి.. 'ఎప్పుడూ నా పెళ్లి గురించే అడుగుతారేంటి. అప్పుడే నా వయసు అయిపోయిందా? ఇప్పుడు లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నా. నాకే వయసు అయిపోలేదు. సమయం వచ్చినప్పుడు చేసుకుంటా. అప్పటి వరకూ సింగిల్ లైఫ్‌ను ఆస్వాదిస్తాను' అంటూ కొంచెం స్ట్రాంగ్‌గానే ఆన్సర్ చేసిందామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X