పవన్ కల్యాణ్‌తో శ్రీముఖి రచ్చ: భానూశ్రీతో కలిసి టాప్ లేపేసేలా.. బండ్ల గణేష్‌ను వాడుతూ సెల్ఫీ వీడియో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు వాళ్లకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా దాదాపు ఇరవై ఏళ్లుగా సినీ రంగంతో పాటు రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపిస్తున్నాడాయన. అందుకే సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు సైతం ఈ మెగా హీరోకు అభిమానులుగా మారిపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఆయనపై ప్రేమను బయట పెట్టేశారు. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ యాంకర్ శ్రీముఖితో పాటు ప్రముఖ నటి భానూ శ్రీ.. పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని వైవిధ్యం చూపించారు. ఇందుకోసం బండ్ల గణేష్‌ను వాడుకున్నారు. ఆ వివరాలు మీకోసం!

చాలా కాలం తర్వాత.. ‘వకీల్ సాబ్’గా పవన్

చాలా కాలం తర్వాత.. ‘వకీల్ సాబ్’గా పవన్

చాలా గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన 'పింక్'కు ఇది రీమేక్‌గా వస్తోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్.. కరోనా వల్ల అలా జరిగింది

ప్రీ రిలీజ్ ఈవెంట్.. కరోనా వల్ల అలా జరిగింది

'వకీల్ సాబ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. కరోనా నేపథ్యంలో పరిమిత జనాభా మధ్యలో జరిగిన ఈ వేడుకకు మంచి స్పందన వచ్చింది. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందులో పవన్ కల్యాణ్ స్పీచ్ ఆకట్టుకుంది. అలాగే, అభిమానులు కూడా ఈ వేడుకలో తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

బండ్ల గణేష్ స్పీచ్ అదుర్స్.. ప్రత్యేక ఆకర్షణగా

బండ్ల గణేష్ స్పీచ్ అదుర్స్.. ప్రత్యేక ఆకర్షణగా


ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. స్వతహాగా పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన అతడు.. ఉద్వేగంగా మాట్లాడుతూ ఆడిటోరియంలో ఉన్న ఫ్యాన్స్ అందరిలోనూ ఉత్సాహాన్ని నింపాడు. మరీ ముఖ్యంగా పవన్‌పై ఉన్న ప్రేమను చాటేందుకు పద్యాన్ని కూడా పాడుకున్నాడు.

టీవీలో ఈవెంట్‌ను చూసిన శ్రీముఖి, భానూశ్రీ

టీవీలో ఈవెంట్‌ను చూసిన శ్రీముఖి, భానూశ్రీ

'వకీల్ సాబ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ ఫంక్షన్‌ను ఏక కాలంలో 1.30 లక్షల మంది లైవ్ ద్వారా తిలకించారు. ఇప్పటి వరకూ దేనికీ ఇంత రెస్పాన్స్ రాలేదు. ఇదే క్రమంలోనే ఈ ఫంక్షన్‌ను బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి, హీరోయిన్ కమ్ యాంకర్ భానూ శ్రీ ఇద్దరూ కలిసి టీవీలో చూశారు. దాన్ని ఇంటర్నెట్‌ ద్వారా చెప్పారు.

ఇద్దరూ కలిసి టాప్ లేచిపోయేలా రచ్చ చేస్తూ

ఇద్దరూ కలిసి టాప్ లేచిపోయేలా రచ్చ చేస్తూ

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ కనిపించినప్పుడల్లా అటు శ్రీముఖి, ఇటు భానూ శ్రీ 'పవర్ స్టార్ పవర్ స్టార్' అంటూ టాప్ లేచిపోయేలా కేకలు వేశారు. అంతేకాదు, టీవీ స్క్రీన్ మీద పవర్ స్టార్ కనిపించేలా సెల్ఫీలు కూడా దిగారు. అలా పరోక్షంగా పవన్ కల్యాణ్‌తో కలిసి రచ్చ రచ్చ చేశారీ ఇద్దరు భామలు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

బండ్ల గణేష్‌ను వాడుకుంటూ ఓ సెల్ఫీ వీడియో

బండ్ల గణేష్‌ను వాడుకుంటూ ఓ సెల్ఫీ వీడియో


ఈ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా 'ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా' అంటూ ఆయన పలికిన మాటలను మెగా ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇక, ఈ డైలాగ్‌నే వాడుతూ శ్రీముఖి, భానూ శ్రీ ఓ సెల్ఫీ వీడియోను రూపొందించారు. దీని ద్వారా పవన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X