Sreemukhi గ్లామరస్ ఫోటోలు వైరల్: అందాల ప్రదర్శనతో ఆకట్టుకొంటున్న రాములమ్మ

కొంత కాలం క్రితం తెలుగు బుల్లితెరపై చాలా తక్కువ మంది యాంకర్లు మాత్రమే ఉండేవారు. అయితే, ఈ మధ్య కాలంలో పదుల సంఖ్యలో లోకల్ బ్యూటీ యాంకర్లుగా తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే క్లిక్ అవడంతో పాటు వరుస ఆఫర్లతో హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో నిజామాబాద్ పిల్ల శ్రీముఖి ఒకరు. టిగా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత యాంకర్‌గా మారిన ఈ భామ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా క్రేజ్‌ను అందుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీముఖి కొన్ని హాట్ హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన శ్రీముఖి ప్రయాణం

అలా మొదలైన శ్రీముఖి ప్రయాణం

శ్రీముఖి యాంకర్ అవడానికి ముందే సినిమాల్లోకి ప్రవేశించింది. అల్లు అర్జున్ నటించిన 'జులాయి'తో నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి మెప్పించింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకుంది.

యాంకర్‌గా మారి హవాను చూపిస్తూ

యాంకర్‌గా మారి హవాను చూపిస్తూ


సినిమాలు చేస్తోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపైకి యాంకర్‌గా అడుగు పెట్టింది. 'అదుర్స్' అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పటికీ సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ సుందరాంగి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలను హోస్ట్ చేసి సత్తా చాటింది.

అప్పటి నుంచి మళ్లీ బిజీ అయింది

అప్పటి నుంచి మళ్లీ బిజీ అయింది

వరుస షోలతో బిజీగా ఉన్నప్పుడే శ్రీముఖి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ మూడో సీజన్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ.. రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. కానీ, ఈ షో వల్ల తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. దీంతో షో తర్వాత ఈ అమ్మడు ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్‌ను సాగిస్తోంది.

రెండు వచ్చాయి... పేరు తెచ్చాయి

రెండు వచ్చాయి... పేరు తెచ్చాయి


అప్పట్లో ఇకపై సినిమాలు చేయనంటూ శ్రీముఖి బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం వెండితెరపై కనిపించలేదు. అయితే, ఇప్పుడు మాత్రం నిర్ణయాన్ని మార్చుకుంది. ఇటీవలే ఆమె 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, నితిన్ 'మాస్ట్రో'లో సైతం ముఖ్యమైన పాత్రలో కనిపించి పేరు తెచ్చుకుంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీనే

అందులో మాత్రం ఎప్పుడూ బిజీనే

కెరీర్ పరంగా బిజీగా ఉన్నా.. లేకున్నా హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

గ్లామర్ ట్రీట్‌తో కాక రేపుతోన్న నటి

గ్లామర్ ట్రీట్‌తో కాక రేపుతోన్న నటి

శ్రీముఖి ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్‌ ఇస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోతూ రచ్చ చేస్తోంది. ఫలితంగా ఆమె ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

Recommended Video

Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
శ్రీముఖి బోల్డ్ ట్రీట్

శ్రీముఖి బోల్డ్ ట్రీట్


తాజాగా శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె బుల్లి గౌను వేసుకుని కనిపించింది. దీంతో ఆమె గ్లామర్ లుక్ నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో శ్రీముఖి షేర్ చేసిన ఈ పిక్స్ అన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X