శివరాత్రి రోజు షాకిచ్చిన శ్రీముఖి: ఏకంగా సెల్‌ఫోన్‌లో ఆయన ఫొటో చూస్తూ..
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, వారిలో కొందరికి మాత్రమే ఎనలేని క్రేజ్ సొంతమైంది. అందులో టెలివిజన్ రాములమ్మ శ్రీముఖి ఒకరు. నటన మీద ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె.. ఆ తర్వాత యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ ముద్దుగుమ్మ.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఫలితంగా విపరీతమైన ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో శివరాత్రి రోజు శ్రీముఖి షాకిచ్చింది. ఏకంగా సెల్‌ఫోన్‌లో ఆయన ఫొటో చూపించింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

నటిగానే పరిచయం.. అలా మొదలెట్టింది
హీరోయిన్ అవ్వాలన్న లక్ష్యంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. ఈ క్రమంలోనే చాలా కాలం పాటు అవకాశాల కోసం ఎదురు చూసింది. ఇలాంటి సమయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'జులాయి'తో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్', 'బాబు బాగా బిజీ' సహా పలు చిత్రాల్లో మంచి పాత్రలను పోషించి మెప్పించింది.

‘అదుర్స్’ నుంచి బొమ్మ అదిరింది వరకూ
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీముఖి 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అన్నింటిలోనూ అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని వరుస ఆఫర్లు అందుకుంది. సుదీర్ఘమైన కెరీర్‌లో 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఆమె కెరీర్‌లో 'పటాస్' ప్రత్యేకమైనదిగా నిలిచింది.

బిగ్ బాస్‌తో మరింత చేరువ.. నిరాశతోనే
బుల్లితెరపై ఎన్నో షోలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖికి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ప్రసారం అయిన మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఈ అమ్మడు.. చివరి వరకూ ఆకట్టుకుంది. అయితే, ఆఖరిలో ఆమెను కాదని సింగర్ రాహుల్ సిప్లీగంజ్‌ను విజయం వరించింది.

ఆ విషయంలో యూటర్న్... రెండింటిలో
సినిమాల్లో నటించే విషయంలో ఆ మధ్య శ్రీముఖి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే ఆఫర్ చేస్తున్నారని, అందుకే సినిమాల్లో నటించడం లేదని చెప్పుకొచ్చింది. కానీ, ఈ మధ్య రూటు మార్చింది. ఇక, ప్రస్తుతం ఈ సత్తిబాబు తెరకెక్కిస్తున్న 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో శ్రీముఖి లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ సినిమాలోనూ అవకాశం అందుకుంది.

హాట్ షోతో హల్‌చల్.. రచ్చ చేసేస్తుందిగా
వరుస షోలు.. సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌లోని విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దీంతో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంటోందామె.

శివరాత్రి రోజు షాకిచ్చిన యాంకర్ శ్రీముఖి
యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్, హోస్టింగ్‌తో పాటు ఎన్నో రకాల విద్యలను ప్రదర్శిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ పర్సనాలిటీగా వెలుగొందుతోంది శ్రీముఖి. ఈ క్రమంలోనే శివరాత్రి రోజు శ్రీముఖి తనలోని కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తూ షాకిచ్చింది. తన సెల్‌ఫోన్‌లో శివుడి ఫొటోను చూస్తూ దాన్ని పెన్సిల్‌తో పేపర్‌పై గీసేసింది. దాన్ని చూపిస్తూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపింది.

తమ్ముడి చేతిలో కార్డ్స్.. జాగరణ మొత్తం
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీముఖి.. రాత్రి మొత్త జాగరణ చేసింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు కొన్ని ఫొటోలను తన స్టోరీలో పెట్టుకుంది. అదే సమయంలో తన సోదరుడు శుస్రుత్ చేతిలో కార్డ్స్ (పేకలు) ఉన్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. తద్వారా రాత్రి మొత్తం అలా కాలక్షేపం చేసినట్లు పరోక్షంగా వెల్లడించింది.


Click it and Unblock the Notifications











