Anchor Sreemukhi: ఆరెంజ్ డ్రెస్సులో అదిరిన శ్రీముఖి అందాలు - ఆ ఫోజులు చూశారంటే ఇక మీ పని అంతే!
Anchor Sreemukhi: మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు తన యాంకరింగ్ తో అదరగొడుతూనే.. సినిమాల్లోనూ నటిస్తోంది. అలాగే బిగ్ బాస్ షోకు వెళ్లి రన్నరప్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. రియాల్టీ షోల్లో కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. సినిమా ఈవెంట్లు, స్పెషల్ ఈవెంట్లు ఇలా అన్నింటినీ చేస్తూ.. ముందుకు సాగుతోంది. ముఖ్యంగా జూనియర్ సుమ అనే పేరు కూడా తెచ్చుకొని అందరినీ తెగ అలరిస్తోంది.
సినిమాలు, షోలతో ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ అందరినీ అలరిస్తుంటుంది. ముఖ్యంగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఔట్ ఫిట్ లో కనిపించింది. ఆరెంజ్ కలర్ ట్రెడీషనల్ వేర్ వేసుకొని ఓ రేంజ్ లో గ్లామర్ షో చేసింది. శ్రీముఖి ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంట్లలోనే లక్షకు పైగా లైకులు వచ్చాయి.

కనకాంబరం రంగు లంగావోణీ వేసుకున్న యాంకర్ శ్రీముఖి.. పైనుంచి కింద వరకు తన అందాలు కనిపించేలా ఫొటోలు దిగింది. ఓ వడ్డాణం పెట్టుకొని, చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ స్టైల్ చేసింది. సింపుల్ గా ఓ బ్రేస్ లెట్ పెట్టుకుంది. మెడలో ఏమీ వేసుకోకుండా అందంగా ముస్తాబైంది. ఈ ఫొటోల్లో శ్రీముఖి చాలా గ్లామరస్ గా ఉంది. ఈమె అభిమానులు కూడా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఆమె గత కొంత కాలంగో ఓ వ్యక్తిని ప్రేమిస్తుందని.. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. మరో రెండు నెలల్లోనే తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని శ్రీముఖి అఫీషియల్ గా ప్రకటిస్తుందని అంతా అనుకుంటున్నారు. వచ్చే వేసవిలోనే శ్రీముఖి మెడలో మూడు ముళ్లు పడబోతున్నాయట. కానీ ఈ వార్తపై శ్రీముఖి కానీ ఆమె తల్లిదండ్రులు కానీ ఇప్పటి వరకూ స్పందించలేదు. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

కెరియర్ పరంగా చాలా యాక్టివ్ గా ఉన్న శ్రీలీల ఒక్కో షోకు లక్ష రూపాయల నుంచి లక్షా 50 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అయితే షోను బట్టి డబ్బులు తీసుకుంటున్న ఈ బ్యూటీ.. సినిమాలకు సెపరేట్ గా ఛార్జ్ చేస్తుందట. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ బాగానే సంపాధించుకుంది. తన అందం, అభినయంతో ఎప్పటికప్పుడు అవకాశాలు దక్కించుకుంటున్న ఈ క్యూట్ బ్యూటీకి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.


Click it and Unblock the Notifications











