ప్రేమికుల రోజున షాకిచ్చిన శ్రీముఖి: ఏకంగా ఆ ఫొటోతో సర్‌ప్రైజ్.. బాయ్‌ఫ్రెండ్ అతడేనా!

గతంలో తెలుగు బుల్లితెరపై చాలా తక్కువ మంది యాంకర్లు మాత్రమే ఉండేవారు. అయితే, ఇటీవలి కాలంలో వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈ మధ్య చాలా మంది యాంకర్లుగా ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు. అందులో మాత్రం కొందరే క్లిక్ అవడంతో పాటు వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో గ్లామర్ క్వీన్ శ్రీముఖి ఒకరు.

నటిగా కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత యాంకర్‌గా మారిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే విపరీతంగా క్రేజ్‌ను అందుకుంది. అలాగే, సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీముఖి వాలంటైన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ పిక్‌ను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన శ్రీముఖి కెరీర్

అలా మొదలైన శ్రీముఖి కెరీర్

యాంకర్ అవడానికి ముందే శ్రీముఖి సినిమాల్లోకి ప్రవేశించింది. అల్లు అర్జున్ నటించిన 'జులాయి'తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి అలరించింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ప్రత్యేకమైన పేరును తెచ్చుకుంది.

యాంకర్‌గానూ హవా చూపిస్తూ

యాంకర్‌గానూ హవా చూపిస్తూ

సినిమా ఆఫర్లు వస్తోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపైకి యాంకర్‌గా ప్రవేశించింది. 'అదుర్స్' అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలలో యాంకర్‌గా పని చేసింది.

మళ్లీ బిజీ అయిపోయిన భామ

మళ్లీ బిజీ అయిపోయిన భామ

యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉన్నప్పుడే శ్రీముఖి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో మూడో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఫినాలేలో ఓడిపోయింది. కానీ, ఈ షో వల్ల తన క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. దీంతో షో తర్వాత మరింత ఉత్సాహంగా కెరీర్‌ను ముందుకు సాగిస్తోంది.

వరుస ఆఫర్లతో యమ బిజీగా

వరుస ఆఫర్లతో యమ బిజీగా

బిగ్ బాస్ ముందు సినిమాలు చేయనంటూ శ్రీముఖి బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం వెండితెరపై కనిపించలేదు. అయితే, ఇప్పుడు మాత్రం నిర్ణయాన్ని మార్చుకుంది. ఇటీవలే ఆమె 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, నితిన్ 'మాస్ట్రో'లో సైతం ముఖ్యమైన పాత్రలో కనిపించి పేరు సంపాదించుకుంది.

అక్కడ మాత్రం ఫుల్ యాక్టివ్‌

అక్కడ మాత్రం ఫుల్ యాక్టివ్‌

వరుసగా ఆఫర్లను అందుకుంటూ బిజీగా ఉన్నా హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఆమెను ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది.

వాలంటైన్స్‌ డేన శ్రీముఖి షాక్

వాలంటైన్స్‌ డేన శ్రీముఖి షాక్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ శ్రీముఖి.. తరచూ తన అందచందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఇంటర్నెట్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ సర్‌ప్రైజ్‌లు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే వాలంటైన్స్ డేన శ్రీముఖి గులాబీ పూలతో దిగిన పిక్‌ను షేర్ చేసి షాకిచ్చిందీ బ్యూటీ.

లైఫ్‌లో బెస్ట్ అంటూ కామెంట్

లైఫ్‌లో బెస్ట్ అంటూ కామెంట్

గులాబీ పూలతో చేసిన బొకే పట్టుకున్న శ్రీముఖి.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఫిబ్రవరి 14, 2022.. ఇది గుర్తు పెట్టుకోండి. మళ్లీ మాట్లాడుకుందాం. జీవితంలోనే బెస్ట్ వాలంటైన్ ఇది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ యాంకరమ్మ ప్రేమలో పడిపోయిందని ప్రచారం మొదలైంది. అదే సమయంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ అతడేనా అని చాలా మంది పలు పేర్లు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X