బెడ్ రూమ్ సన్నివేశాలలో రెచ్చిపోవడమే శాపమైంది.. ఎవరు చూసిన అదే కావాలంటున్నారు

రొమాంటిక్ సీన్స్ లలో నటిస్తే కొందరి కెరీర్ ఒక్క రోజులోనే మారిపోతుంది అనే ఫార్ములా ప్రతి సారి వర్కౌట్ కాకపోవచ్చు. రెగ్యులర్ గా ఒకే రకమైన సినిమాలు చేయడం అనేది బోరింగ్ గా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఒక యాక్టర్ గా సంతృప్తి ఉండదనేది కొందరు సీనియర్ ఆర్టిస్టులు చెప్పేమాట. ఇక ఆండ్రియా జెరెమియా కూడా ఇప్పుడు అదే తరహాలో కామెంట్స్ చేస్తోంది. ఆమెను ఎక్కువగా రొమాంటిక్ పాత్రలే వెంటాడుతున్నాయి.

యుగానికి ఒక్కడు సినిమాతో..

యుగానికి ఒక్కడు సినిమాతో..

నిజానికి ఈ బ్యూటీ ఒక సింగర్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ ఆ తరువాత ఆమెలో అద్భుతమైన నటి దాగి ఉందని చాలా మంది చెప్పడంతో హీరోయిన్ గా అడుగులు వేసింది. యుగానికి ఒక్కడు సినిమా ఆండ్రియాకు ఒక నటిగా మంచి బూస్ట్ ఇచ్చింది. కెరీర్ మొదట్లో కాస్త డిఫరెంట్ గా అడుగులు వేసినప్పటికి ఆ తరువాత ఆమెకు రొటీన్ ఆఫర్స్ ఎక్కువగా వచ్చాయి.

అదే ఆమెకు శాపంలా మారుతోందట

అదే ఆమెకు శాపంలా మారుతోందట

కమల్ హాసన్ తో విశ్వరూపం తరువాత ఆండ్రియా సినిమాల్లో రొమాన్స్ డోస్ ని మరింత పెంచిందనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. మెయిన్ గా వడచెన్నై సినిమాలో ఈ బ్యూటీ బెడ్ రూమ్ సీన్ లో గట్టిగానే రెచ్చిపోయింది. ఆ సినిమా మొత్తంలో ఆండ్రియా సీన్స్ ఎక్కువగా హైలెట్ అయ్యాయి. అయితే ఇప్పుడు అదే ఆమెకు శాపంలా మారుతోందట. చాలా వరకు ఆ సినిమాలోని కొన్ని సీన్లను ఎడిటింగ్ లో తీసేశారట.

అలా నటించి తప్పుచేశా..

అలా నటించి తప్పుచేశా..

ఇక ఎడిటింగ్ లేపేసిన బోల్డ్ సీన్స్ కొన్ని సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఆండ్రియా పేరు ఒక్కసారిగా మారుమ్రోగింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండ్రియా ఆ సినిమాలో రెచ్చిపోయి నటించడం వలనే అలాంటి రొమాంటిక్ పాత్రలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పింది. నిజంగా వడచెన్నై సినిమాలో రొమాంటిక్ డోస్ ఎక్కువైందని, అలా నటించి చాలా తప్పు చేశానని కూడా వివరణ ఇచ్చింది.

Recommended Video

SP Balasubrahmanyam డబ్బింగ్ చెప్పిన మొదటి చిత్రం ఇదే, దశావతారం చిత్రం హైలైట్
 రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధమే..

రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధమే..

ఇక ఏదైనా సినిమాకు ఒప్పుకుంటే అందులో ఆండ్రియాతో ఒక్క బెడ్ రూమ్ సీన్ అయినా ఉండాలని దర్శక నిర్మాతలు లెక్కలు వేసుకునే పరిస్థితి ఏర్పడిందట. ఇక ఫైనల్ గా ఈ బ్యూటీ ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ అలాంటి పాత్రలు సినిమాకు అవసరం అయితే తప్ప నటించలేను అంటూ కేవలం పాత్రకు ప్రాధన్యం ఉన్న వాటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెబుతోంది. ఇక క్యారెక్టర్లు వినూత్నంగా ఉంటే రెమ్యునరేషన్ కాస్త తక్కువ ఇచ్చిన పర్లేదని కూడా అంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X