నగ్నంగా చేస్తే తప్పేంటి.. రియల్ లైఫ్‌లో అలా అనుభవించా: తడాఖా హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత నటిగా మారి.. దక్షిణాదిలోని చాలా భాషల్లో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది ఆండ్రియా జెరోమియా. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఎన్నో విధాలుగా నేషనల్ వైడ్‌గా హైలైట్ అయింది. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో మరింత ఉత్సాహంగా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా తన జీవితంలో జరిగిన ఓ షాకింగ్ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూడండి మరి!

సింగర్‌గా... తెలుగులోనూ: ఆండ్రియా జెరీమియా చిన్న వయసులోనే సింగర్‌గా పరిచయం అయింది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాటలు పాడింది. ఫలితంగా బెస్ట్ సింగర్‌గా బోలెడన్ని అవార్డులు కూడా అందుకుంది. ఈ క్రమంలోనే తెలుగులోనూ ఆమె పాటలు పాడింది. మరీ ముఖ్యంగా దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 'బొమ్మరిల్లు', 'కింగ్', 'దడ' సహా ఎన్నో చిత్రాలకు పని చేసింది.

 Andrea Jeremiah

హీరోయిన్‌గా.. తడాఖాతో: సింగర్‌గా ఎనలేని గుర్తింపును అందుకున్న ఆండ్రియా జెరీమియా.. 'పచ్చైకిల్లి ముత్తుచారామ్' అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోల చిత్రాల్లోనూ భాగం అయింది. ఇక, 'తడాకా' అనే సినిమాతో తెలుగులోకి కూడా అడుగు పెట్టి హైలైట్ అయింది.

ఎఫైర్‌స్.. వివాదాలతోనే: అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం అయిన సుచీ లీక్స్‌లో ఆండ్రియా ఫొటోలు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుథ్‌తో పెనవేసుకుని ఉన్న ఫొటోలు అప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అలాగే ఆండ్రియా పలు వివాదాల్లోనూ భాగమైంది. ఇలా ఈ అమ్మడు కెరీర్ కంటే కాంట్రవర్శీలతోనే సెన్సేషన్‌గా మారిపోయింది.

 Andrea Jeremiah

వరుస సినిమాలతో బిజీ: ఆండ్రియా జెరీమియా ప్రస్తుతం ఎన్నో చిత్రాల్లో నటిస్తోంది. ముఖ్యంగా తమిళంలో 'పిశాచు 2', 'కా', 'మాలింగై', 'నో ఎంట్రీ'తో పాటు కొన్ని పేర్లు పెట్టని సినిమాల్లోనూ భాగం అయింది. వీటితో పాటు విక్టరీ వెంకటేష్ - శైలేష్ కొలను కాంబోలో రూపొందుతోన్న 'సైంధవ్'లోనూ నటిస్తోంది. వీటితో పాటు సింగర్‌గానూ కొన్ని సినిమాలకు ఆండ్రియా వర్క్ చేస్తోంది.

నగ్నంగా.. విమర్శలతో: గత ఏడాది ఆండ్రియా జెరోమియా తమిళంలో 'అనల్‌ మేల్‌ పణితులి' సినిమాలో నటించింది. ఆర్ కైసర్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ నిర్మించారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రంలో ఆండ్రియా అర్ధనగ్నంగా కనిపించింది. దీంతో ఆమెపై ఓ రేంజ్‌లో విమర్శలు వచ్చాయి. ఫలితంగా ఈ చిత్రం అప్పుడు హాట్ టాపిక్ అయింది.

 Andrea Jeremiah

నగ్నంగా చేస్తే తప్పా?: ఏకధాటిగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న ఆండ్రియా జెరోమియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో 'అనల్‌ మేల్‌ పణితులి' మూవీలో నగ్నంగా నటించడం గురించి స్పందించింది. 'నిజంగానే ఈ సినిమాలో ఓ కీలక సన్నివేశంలో నగ్నంగా నటించాను. ఆ సమయంలో సిగ్గుగా అనిపించింది. కానీ, క్యారెక్టర్ కోసం నగ్నంగా నటిస్తే తప్పేంటి' అని పేర్కొంది.

 Andrea Jeremiah

ఇంకా అనుభవించాను: ఆ తర్వాత ఆండ్రియా జెరోమియా కంటిన్యూ చేస్తూ.. 'సినిమా కోసం నగ్నంగా నటించినంత మాత్రాన తప్పు చేసినట్లు ఎలా అవుతుంది? దీన్ని చాలా మంది ట్రోల్ చేయడం బాధగా అనిపించింది. అయినా నా రియల్ లైఫ్‌లో ఇంతకంటే ఎక్కువ సమస్యలనే అనుభవించాను. కాబట్టి దీని నుంచి త్వరగానే కోలుకోగలిగాను' అంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X