బట్టలు లేకుండా సీన్... ఆ డైరెక్టర్ సెట్‌లో అలా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
కథ, కథనాలు డిమాండ్ మేరకు సినిమాలలో శృంగార సన్నివేశాలు, లిప్‌లాక్స్, ఇతర రొమాంటిక్ సీన్స్‌ను దర్శకులు సిద్ధం చేస్తుంటారు. అయితే వాటిని షూట్ చేయడం అంత తేలిక కాదు. ఇక నటీనటులు కూడా మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలి. సినిమా రిలీజ్‌కు ముందే, ఆ తర్వాత వచ్చే వివాదాలను, అభ్యంతరాలను కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అందుకే చాలామంది రొమాంటిక్ సీన్స్‌ని ఓ పరిమితికి మించి చేయరు. కొందరు మాత్రమే ధైర్యంగా అడుగు ముందుకు వేస్తుంటారు. ఈ సన్నివేశాల్లో నటీనటులలో హీరోయిన్లకు ఎక్కువ ధైర్యం, తెగువ కావాలి. తాజాగా న్యూడ్ సీన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు తమిళ నటి ఆండ్రియా జెరెమా. ఈ వివరాల్లోకి వెళితే..
సింగర్‌గా, నటిగా గుర్తింపు
లోహం, లండన్ బ్రిడ్జి, యుగానికి ఒక్కడు, తడఖా, విశ్వరూపం తదితర సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ఆండ్రియా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగానే కాకుండా సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆండ్రియా స్టైల్. ఈ ఏడాది మాస్క్ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు ఈ ముద్దగుమ్మ. ప్రస్తుతం ఆమె పిశాచి 2, నో ఎంట్రీ, మనుషి సినిమాలలో నటిస్తున్నారు.

వివాదాలతో వార్తల్లోకి
నటిగా, సింగర్‌గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ మీడియాలో హైలైట్‌గా మారుతున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో ప్రేమాయణం, మరో సీనియర్ నటుడితో రిలేషన్ తదితర అంశాలు కోలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. అయినప్పటికీ తన కెరీర్‌ను ఎదురులేకుండా సాగించి మొండి మనిషి అనిపించుకున్నారు ఆండ్రియా. విషయం ఏదైనా సరే మనసులో ఉన్నది మాట్లాడటం ఆమె స్టైల్. 11 ఏళ్ల వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురైనట్లు బయటపెట్టి షాకిచ్చింది.
అరుదైన వ్యాధితో నరకయాతన
కెరీర్ పీక్స్‌లో ఉండగా ఒక దశలో సడెన్‌గా సినిమాలు మానేసి చిత్ర పరిశ్రమకు షాకిచ్చింది ఆండ్రియా. ఈమె పలువురు హీరోలతో ప్రేమాయణం సాగించినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే తాను ఓ వ్యాధి కారణంగా సినిమాలకు దూరమైనట్లు ఆండ్రియా వెల్లడించారు. ఆటో ఇమ్యూన్ స్కిన్ కండీషన్ అనే వ్యాధితో బాదపడుతున్నానని.. దీని వల్ల కనుబొమ్మలు, వెంట్రుకలు బూడిద రంగులోకి మారుతాయని, అలాగే తన ముఖం అందవిహీనంగా మారుతుందని చెప్పి బాంబు పేల్చింది. ఇలాంటి పరిస్ధితులు, తన ట్రీట్‌మెంట్ కారణంగా సినిమాలకు దూరమైనట్లు ఆండ్రియా తెలిపింది.
పిశాచి 2లో నగ్నంగా సీన్
తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండ్రియా జెరెమా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె నటిస్తోన్న పిశాచి 2 అనే హార్రర్ చిత్రం సెట్స్ మీదకి వెళ్లి, షూటింగ్ పూర్తి చేసుకుని పలు కారణాలతో విడుదల కాలేదు. ఈ పిశాచి 2కు మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆండ్రియా నగ్నంగా నటించిన పోస్టర్ విడుదల కావడం.. దీనిపై విమర్శలు రావడం కలకలం రేపింది. తాజా ఇంటర్వ్యూలో ఆండ్రియాకు ఈ పోస్టర్ గురించే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. పిశాచి 2 కథాచర్చల సమయంలోనే బోల్డ్ సీన్ చేర్చారని.. దాని గురించి వివరించారని ఆండ్రియా తెలిపారు. అయితే సెట్స్ మీదకి వెళ్లాక షూటింగ్ సమయంలో ఆ సన్నివేశాన్ని తొలగించారు. తానే కాదు.. ఈ సినిమాలో ఎవ్వరూ నగ్నంగా నటించరని ఆమె క్లారిటీ ఇచ్చింది. అయితే పిశాచి 2లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయని.. కానీ అవి నగ్న సన్నివేశాలు కాదని ఆండ్రియా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











