అలాంటి వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరోయిన్.. అందుకే సినిమాలకు దూరం..
ఇటీవల సినిమా హీరోయిన్స్, స్టార్స్ తమ వ్యక్తిగత విషయాలను నిర్మొహమాటంగా బయట పెట్టేస్తున్నారు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తమ బాధలను, సంతోషాలను పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ డైలీ ఆక్టివిటీస్ ను షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్.. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని, అందుకే సినిమాలకు దూరం అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ప్రేమ వ్యవహారంతో దూరమయ్యానంటూ అనవసరంగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటూ బాధపడింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమెకు వచ్చిన అరుదైన వ్యాధి ఏంటి? మీరు కూడా ఓ లూక్కేయండి?
సినీ తారలు తమ వ్యక్తిగత విషయాలను ఆరోగ్య సమస్యలను ఎలాంటి మొహమాటం లేకుండా బయట పెట్టేస్తున్నారు. తమ బాధలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా.. స్టార్ హీరోయిన్ సమంత.. నాగచైతన్యతో విడాకుల తర్వాత.. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని, నిత్యం ఆ వ్యాధి నివారణకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానే తన అభిమానులకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. నిత్యం తన ఫోటోలు , అప్డేట్స్, మోటివేషన్ కొటేషన్ పెడుతుంది సమంత.

తాజాగా హీరోయిన్ ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah).. కూడా హీరోయిన్ సమంత బాటలోనే నడుస్తుంది. తాను కూడా గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని వెల్లడించింది. హీరోయిన్ ఆండ్రియా జెర్మియా కు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్ముడు సింగర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ నటనపై ఇంట్రెస్ట్ తో యాక్టర్ గా అవకాశం అందిపుచ్చుకుంది. 'అన్నయమ్ రసూల్' అనే సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.తన నటనతో వరుస అవకాశాలను అంది పుచ్చుకుంది.
'లోహం', 'లండన్ బ్రిడ్జి' వంటి సినిమాలలో నటించి మెప్పించింది ఆండ్రియా జెర్మియా. ఇక కార్తీ నటించిన 'యుగానికి ఒక్కడు' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ తర్వాత 'తడఖా' అనే సినిమాతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది హీరోయిన్ ఆండ్రియా జెర్మియా. ఇలా ఈ అమ్మడు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా సడన్ గా సినిమాలు చేయడం మానేసింది. దీంతో లవ్ ఫెయిల్యూర్స్ కారణంగానే ఇండస్ట్రీకి దూరమైందంటూ పలు రూమర్స్ వచ్చాయి.
తాజాగా హీరోయిన్ ఆండ్రియా జెర్మియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సమయంలో తనపై వస్తున్న రూమర్స్ అన్నింటిని కొట్టేసింది. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని, దాని పేరు ఆటో 'ఆటో ఇమ్యూన్ స్కిన్ కండిషన్' అని చెప్పింది. ఈ వ్యాధి వల్ల కనుబొమ్మలు, వెంట్రుకలు బూడిద రంగులోకి మారుతాయని, ముఖం అందవికాహారంగా మారుతుందని బాధపడింది. అలాగే శరీరంపై ఎన్నో మచ్చలు ఉన్నాయని, మానసిక ఒత్తిడి వలన ఇలాంటి పరిస్థితి తనకు వచ్చిందని బాధపడింది.ఈ వ్యాధి నివారణ కోసం ఆక్యుపెన్సర్ ట్రీట్మెంట్ ను తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

తాను ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలలో నటించడం సరికాదని తానే దూరంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్ ఆండ్రియా జెర్మియా . కానీ, తనపై లేనిపోని పుకార్లకు క్రియేట్ చేస్తున్నారని లవ్ ఫెయిల్యూర్ కారణంగానే సినిమాలకు దూరమైందంటూ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం హీరోయిన్ ఆండ్రియా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ హీరోయిన్ అరుదైన వ్యాధి గురించి తెలుసుకుని అభిమానులు బాధపడుతున్నారు. త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











