శ్రీరెడ్డి చెప్పేది వాస్తవం.. క్యాస్టింగ్ కౌచ్ నిజమే.. అలాంటి ఘటనలు నాకు.. శిక్షించాలి.. ఆండ్రియా
Recommended Video

అందం, అభినయంతోపాటు మంచి గాయనిగా అండ్రియా జెర్మియా ఒకరు. అటు సింగర్‌గానూ, ఇటు నటిగానూ వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకొంటున్నారు. తారమణి, డిటిక్టివ్ చిత్రాల్లో నటనతో ఆమె ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం ఆమె నటించిన విశ్వరూపం2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కమల్ హసన్ సరసన నటించింది. సైనిక గూఢచారిగా అండ్రియా కనిపించింది. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ ప్రముఖ దినపత్రికకు శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందించారు.

అందులో మజా తెలిసింది
2013లో వచ్చిన విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా విశ్వరూపం2 వచ్చింది. ఈ చిత్రంలో అశ్విత పాత్రను పోషించాను. రెండో భాగంలోనే నా పాత్ర బాగుంటుంది. నటనతో పాటు యాక్షన్ సీన్లలో ఫైట్ చేశాను. నటిగా నా ఎంట్రీ ఎదో అలా జరిగిపోయింది. కాలక్షేపం కోసం నటించడం ప్రారంభించిన తర్వాత అందులో మజా ఏంటో తెలిసింది.

బాధ్యతగా వ్యవహరించాలి
విశ్వరూపం చిత్రంలో నటించిన తర్వాత దేశభక్తి, సామాజిక బాధ్యత ఎక్కువైంది. దేశం కోసం ప్రతీ పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి. కేవలం స్టడీస్‌తో దేశంపై అవగాహన పెరగదు. దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దేశం రక్షణ, అభివృద్ధి కోసం మనవంతు సహకారం అందించాలి అని అండ్రియా అన్నారు.

ఆంక్షలు విధించను
ఏ సినిమానైనా పాత్ర నచ్చితే చేస్తాను. ఎలాంటి అంక్షలు విధించను. ఒకసారి సినిమా ఒప్పుకొంటే పూర్తయ్యే వరకు మాటపైనే నిలబడుతాను. నేను నటించిన విశ్వరూపం ఇప్పుడే విడుదలైంది. ఆ తర్వాత వడచెన్నైలో నటించాను. ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాను. ఎక్కువ మంది హీరోయిన్ల ఉంటే చిత్రాల్లో నటిస్తే నా స్థాయి తగ్గదు అని ఆండ్రియా పేర్కొన్నారు.

శ్రీరెడ్డి వివాదంపై స్పందన
తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి వివాదంపై అండ్రియా స్పందించారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. ఆమె చెప్పేది నిజం. అలాంటి వాటిని బయటకు చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి. నా కెరీర్‌లో అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు అని అండ్రియా అన్నారు.

వారిని కఠినంగా శిక్షించాలి
కెరీర్ కోసం వచ్చే ఔత్సాహిక తారలకు వేధింపులు ఉంటాయి. ఎవరికైనా జరిగితే ధైర్యంగా ముందుకొచ్చి బయటపెట్టాలి. అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. మహిళల బలహీనతలను అడ్డం పెట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడటం సరికాదు అని అండ్రియా చెప్పారు.


Click it and Unblock the Notifications











