twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా మంది మగాళ్ళకు అసలు ఆ విషయమే తెలియదు.. ఆండ్రియా సెన్సేషనల్ కామెంట్స్

    |

    దక్షిణాదిలో అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న హీరోయిన్ ఆండ్రియా జెర్మియా తాజాగా పుథం పుధు కాలై అనే వెబ్ సిరీస్‌తో ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజైన ఈ వెబ్ సిరీస్‌లో రాజీవ్ మీనన్, సుహాసిని మణిరత్నం, గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖులు భాగమయ్యారు. లాక్‌డౌన్ నేపథ్యంగా రూపొందిన ఈ అంథాలజీ రిలీజ్ నేపథ్యంలో ఆండ్రియా జెర్మియా మీడియాతో మాట్లాడుతూ...

    లాక్‌డౌన్ జీవితంలో

    లాక్‌డౌన్ జీవితంలో

    లాక్‌డౌన్ సమయంలో నా జీవితం పూర్తిగా స్తంభించింది. సినిమాల్లో నటించలేదు, బయటకు వెళ్లి మంచి ఫుడ్ తినలేకపోయాను. కనీసం జిమ్‌కు వెళ్లి వర్కవుట్లు కూడా చేయలేకపోయారు. జీవితమంతా నాలుగు గోడలకే పరిమితమైంది. జీవితాన్ని ఓ సవాల్‌గా స్వీకరించాను అని ఆండ్రియా జెర్మియా పేర్కొన్నారు.

    అలాంటి కాన్సెప్ట్‌తో థ్రిల్‌గా

    అలాంటి కాన్సెప్ట్‌తో థ్రిల్‌గా

    లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఓ రకమైన జీవితాన్ని అనుభవించిన తర్వాత.. అదే కాన్సెప్ట్‌తో ఓ కథ నా ముందుకు వచ్చినప్పుడు థ్రిల్‌గా ఫీలయ్యాను. పుథం పుధు కాలై‌లోని కొన్ని కథల్లో రీ యూనియన్ అనే కథగా రూపొందిన ఎపిసోడ్‌లో నటించాను. రాజీవ్ మీనన్ దర్వకత్వంలో రూపొందిన కథలో డ్రగ్స్‌కు బానిసైన ఓ యువతిగా నటించాను అని అండ్రియా తెలిపారు.

    నాకు నచ్చిన సినిమా తారామణి

    నాకు నచ్చిన సినిమా తారామణి

    ఇటీవల కాలంలో తారామణి నాకు నచ్చిన చిత్రం. దర్శకుడు రామ్ అద్భుతమైన రైటర్. ఆయనలో ఓ ఫెమినిస్టు కనిపిస్తారు. మహిళల బాధలను, వారి జీవితాల గురించి రాయడంలో ఆయనను మించిన వారు ఉండరు. చాలా మందికి ఆడవాళ్ల పాత్రల గురించి రాయడం తెలియదు. అందుకే మహిళా రైటర్ల అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది అని ఆండ్రియా జెర్మియా పేర్కొన్నారు.

    Recommended Video

    Heroine Andrea Jeremiah Reacts On Sri Reddy Issue
    మిస్కిన్ గొప్ప దర్శకుడు

    మిస్కిన్ గొప్ప దర్శకుడు

    నాకు ఇష్టమైన దర్శకుడు మిస్కిన్. ఆయన తమిళ చిత్ర పరిశ్రమ అందించిన అమూల్యమైన బహుమతి. ఆయనతో పనిచేయడమంటే నాకు చెప్పలేనంత ఇష్టం. లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఓ కథను రాశారు. ఆ కథ నిజంగా ఓ సవాల్‌తో కూడినది అని ఆండ్రియా జెర్మియా తెలిపారు.

    English summary
    Andrea Jeremiah excited over anthology of Putham Pudhu Kaalai. She showers praises on Rajeev menon of Reunion. She said. Most of film makers don't know about women issues and they dont how to present women on screen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X