బీచ్‌లో రెచ్చగొడుతోన్న బ్యూటీ.... 40 ఏళ్ల వయసులో కాంట్రవర్సీ క్వీన్ అరాచకం
చిత్ర పరిశ్రమలో కొందరు వ్యక్తులుంటారు. వారు ఏం చేసినా, ఏం మాట్లాడినా అది వివాదంలా మారుతుంది. ఇక సోషల్ మీడియా రాకతో వారు చేసే పోస్టులు కూడా అంతే వైరల్‌గా మారుతుంటాయి. ఈ కోవలోకే వస్తారు కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెరెమియా. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆండ్రియా తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే...
ఆంగ్లో ఇండియన్ మూలాలకు చెందిన కుటుంబంలో తమిళనాడులోని అరక్కోణంలో జన్మించారు ఆండ్రియా. ఆమె తండ్రి మద్రాస్ హైకోర్టులో లాయర్. చిన్నప్పటి నుంచే సంగీతం, నటనపై ఆసక్తితో పదేళ్ల వయసులోనే పియానో వాయించడం నేర్చుకున్నారు ఆండ్రియా. థియేటర్ ఆర్టిస్ట్‌గా కాలేజీ రోజుల్లోనే సత్తా చాటారు. 2007లో తమిళ చిత్రం పచైకిలి ముతుచారం మూవీతో వెండితెరపై అడుగుపెట్టారు ఆండ్రియా. ఆ తర్వాత అన్నయుం రసూలమ్, విశ్వరూపం, ఎండ్రెన్‌డ్రం పున్నాగై, అర్ణామనై, లోహం, తూపిల్ జోపాన్, తారామణి, అవల్, వడ చెన్నై, అర్ణామనై 3, అనెల్ మేలే పతి థూలి అనే సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తడఖా మూవీ ద్వారా తెలుగు వారిని పలకరించారు ఆండ్రియా. అయితే అప్పటికే యుగానికి ఒక్కడుతో ఇక్కడి ప్రజలకు బాగా సుపరిచితులు అయ్యింది ఈ ముద్దుగుమ్మ. రెండేళ్ల క్రితం విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్‌లో కీలకపాత్ర పోషించారు. మొత్తంగా 19 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించింది ఆండ్రియా. సినిమాలతో పాటు బుల్లితెరపై హోస్ట్‌గా, జడ్జిగానూ ఈమె సత్తా చాటింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పలువురు హీరోయిన్లకు గాత్రదానం చేశారు. ఇక నేపథ్య గాయనీగా అంతకు మించి ఫేమస్ అయ్యారు ఆండ్రియా. పలు భాషల్లో పాటలు పాడి అలరించారు.
ఇక వివాదాలతోనూ ఆండ్రియా అంతే ఫేమస్ అయ్యారు. పిశాచి 2లో పూర్తి నగ్నంగా నటించింది. దాంతో కోలీవుడ్ షాక్ అయ్యింది. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్‌తో ఆండ్రియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. అలాగే పలువురితో డేటింగ్ చేసినట్లు పబ్లిక్‌గా చెప్పి కలకలం రేపింది ఈ ముద్దుగుమ్మ. తను నటించిన తారామణి, మానుషి తదితర చిత్రాలు సెన్సార్ పూర్తికాకపోవడంపైనా ఆండ్రియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పిశాచి 2, నో ఎంట్రీ, మానుషి సినిమాలలో ఆండ్రియా నటిస్తున్నారు.
ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సోలోగా తన జీవితాన్ని సాగిస్తున్నారు. 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తడం లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆండ్రియా... ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు, ఇతర అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో హల్ చల్ చేస్తుంటారు ఆండ్రియా. తాజాగా పొట్టి నిక్కర్, టాప్ ధరించి బీచ్‌లో చక్కర్లు కొడుతున్న ఆండ్రియా సెగలు రేపుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా.. 40 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో వెలిగిపోతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











