For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లైన వ్యక్తితో ఎఫైర్ నడిపానని ఒప్పుకున్న ఆండ్రియా.. ఆ న్యూడ్ వీడియోలో ఉన్నది ఎవరు.?

|

సింగర్‌గా సినీ రంగ ప్రవేశం చేసి.. హీరోయిన్‌గా కొనసాగుతోంది సౌత్ ఇండియన్ బ్యూటీ ఆండ్రియా. విలక్షణ నటనకు తోడు సాహసాలు చేయడంతో ఈమె అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపును తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నో అవకాశాలను దక్కించుకుంది. చిన్న హీరోలతో కాదు.. పెద్ద పెద్ద స్టార్లతోనూ నటించింది. తెలుగులోనూ పలు సినిమాల్లో మెరిసింది. దీంతో పాటు కొన్ని దక్షిణాది భాషల్లోనూ నటించింది. ఈ కారణంగానే ఆండ్రియా చాలా ఫేమస్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ పుస్తకం రాసింది. అందులో ఓ షాకింగ్ విషయాన్ని ప్రస్తావించింది.

బోల్డ్ స్టేట్‌మెంట్స్

బోల్డ్ స్టేట్‌మెంట్స్

ఆండ్రియా ఎన్నో సార్లు వార్తల్తో నిలిచింది. దీనికి కారణం ఆమె బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇవ్వడమే. సెక్స్.. డేటింగ్.. కిస్సెస్ ఇలా ఎన్నో అంశాలపై బహిరంగంగా మాట్లాడిన ఈమె.. ఎన్నో సార్లు విమర్శల పాలైంది. సోషల్ మీడియా వేదికగానే కాకుండా చాలా మంది ఆమెను డైరెక్టుగా కూడా తిట్టేశారు.

సుచీ లీక్స్ ఫొటోతో..

సుచీ లీక్స్ ఫొటోతో..

దక్షిణాదిన సంచలనం రేకెత్తించిన సుచీ లీక్స్ సమయంలో ఆండ్రియా ఫొటోలు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుథ్‌తో పెనవేసుకుని ఉన్న ఫొటోలు అప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న వార్తలకు బలం చేకూరినట్లైంది.

బుక్ రిలీజ్

బుక్ రిలీజ్

‘విశ్వరూపం 2', ‘వాడా చెన్నై' సినిమాల తర్వాత కనిపించకుండా పోయిన ఆండ్రియా తాజాగా మీడియా ముందుకు వచ్చింది. ఆండ్రియా రెండు రోజుల క్రితం ‘బ్రోకెన్‌ వింగ్‌' పుస్తకం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. పద్యాల రూపంలో వ్యక్తిగత విషయాలు, భావాలను అందరితో పంచుకోవడానికి ధైర్యం కావాలని అన్నారు. అభిమానుల కోసం ‘బ్రోకెన్‌ వింగ్‌' పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని కూడా ప్రారంభించానని పోస్ట్‌ చేశారు.

ఎఫైర్ బయటపెట్టింది

ఎఫైర్ బయటపెట్టింది

ఈ పుస్తకంలో తన ఎఫైర్‌ను బయటపెట్టింది. ‘‘నేను ఓ పెళ్లయిన వ్యక్తిని ప్రేమించాను. అతడు నన్ను మానసికంగా, శారీరకంగా వేధించాడు. దీన్ని భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. తిరిగి కోలుకోవడానికి ఆయుర్వేద చికిత్స తీసుకున్నా. ఈ బాధలోనే ‘బ్రోకెన్‌ వింగ్‌‌' పుస్తకాన్ని రాశా. ఈ సమస్యల నుంచి బయటపడేందుకే సినిమాల నుంచి కాస్త బ్రేక్‌ తీసుకున్నా'' అని ఆండ్రియా వెల్ల‌డించింది. అయితే, అప్పుడు బయటికొచ్చిన ఓ వీడియోలో ఉన్నది ఆమెనా కాదా అన్న విషయం మాత్రం చెప్పలేదు.

ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు

ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు

డిప్రెషన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఆండ్రియా.. తమిళంతో పాటు పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతానికైతే ఆమె చేతిలో ‘కా', ‘వట్టం', ‘మాలింగై' ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రకటనలు త్వరలోనే వెలువడనున్నాయి.

English summary
Singer-actress Andrea Jeremiah was last seen playing one of the lead roles in Vetri Maaran's Vada Chennai and won laurels for her performance. However, the actress has been missing in action since then.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more