పబ్లిక్‌లోనే భర్తతో శ్రీయ శరణ్ రొమాన్స్: అలా రెచ్చగొట్టి మరీ ఘాటు ముద్దులు.. వీడియో వైరల్

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు తన హవాను చూపించి.. దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన బ్యూటీ శ్రీయ శరణ్. చూపు తిప్పుకోకుండా చేసే అందం.. అద్భుతమైన నటన.. ఆకట్టుకునే హవాభావాలతో ప్రేక్షకులను మైమరపించిన ఈ భామ.. వరుస అవకాశాలను అందుకుంటూ సత్తా చాటింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో చాలా ఏళ్ల పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే ఎన్నో భాషల్లో నటించి మెప్పించింది. ఇక, ఆండ్రీ అనే విదేశీయుడిని ప్రేమ పెళ్లి చేసుకున్న శ్రీయ.. అప్పటి నుంచి సినిమాలను తగ్గించేసింది. అయితే, అతడితో మాత్రం లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీయ తన భర్త ఆండ్రీతో పబ్లిక్‌లోనే రొమాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోపై మీరూ లుక్కేయండి!

అలా పరిచయం.. స్టార్ హీరోయిన్‌గా సత్తా

అలా పరిచయం.. స్టార్ హీరోయిన్‌గా సత్తా

చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది శ్రీయ శరణ్. అక్కడ తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. అలా కొన్నేళ్ల పాటు అక్కడ సత్తా చాటిన తర్వాత 'ఇష్టం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున నటించిన 'సంతోషం'తో ఫస్ట్ హిట్‌ను అందుకుంది. అనంతరం శ్రీయ సోలో హీరోయిన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే కెరీర్ ఆరంభంలోనే పదుల సంఖ్యలో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా శ్రీయ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

 తెలుగులో హవా చూపించి.. ఆ రికార్డులు

తెలుగులో హవా చూపించి.. ఆ రికార్డులు

కెరీర్ ఆరంభంలోనే తనలోని టాలెంట్లను చూపించిన శ్రీయ శరణ్.. కొన్ని కోట్ల మంది అభిమానాని దక్కించుకుంది. అదే సమయంలో టాలీవుడ్‌లో ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరితోనూ ఆడిపాడింది. అలా కొన్నేళ్ల పాటు ఏడాది పది సినిమాల చొప్పున చేస్తూ రికార్డు క్రియేట్ చేసింది. ఆమె దూకుడుకు సినీ పెద్దలే ఆశ్చర్యపోయేవారు. ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్‌లోనూ శ్రీయ అప్పట్లోనే ఎవరికీ అందనంత తీసుకునేది. దీంతో శ్రీయ పేరు మారుమ్రోగిపోయింది.

అతడితో సీక్రెట్‌గా డేటింగ్.. పెళ్లి చేసుకుని

అతడితో సీక్రెట్‌గా డేటింగ్.. పెళ్లి చేసుకుని

సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీయ శరణ్‌పై లవ్ ట్రాకులు, డేటింగ్‌కు సంబంధించిన రూమర్లు మాత్రం ఎప్పుడూ పెద్దగా రాలేదు. ఆమె ఆరంభం నుంచి ప్రొఫెషనల్‌ లైఫ్‌ మీదే ఎక్కువగా ఫోకస్ చేసింది. అందుకే ఈ వ్యవహారాలకు దూరంగా ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీయ శరణ్.. ఆండ్రీ అనే విదేశీ వ్యాపారవేత్తతో ప్రేమలో పడిపోయింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు లవ్ ట్రాకును నడిపిన తర్వాత 2018లో అతడిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి అతడితో ఎంజాయ్ చేస్తోంది.

 పెళ్లి తర్వాత స్పీడు తగ్గించి... చేతిలో ఇవి

పెళ్లి తర్వాత స్పీడు తగ్గించి... చేతిలో ఇవి

వివాహం తర్వాత కూడా శ్రీయ శరణ్ తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది. తద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అయితే, గతంలో ఏడాదికి పది సినిమాల వరకూ చేసిన ఈ స్టార్ హీరోయిన్ పెళ్లి తర్వాత వేగం తగ్గించేసింది. దీంతో కేవలం కొన్ని సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRRలో కీలక పాత్రను పోషించిన ఆమె.. ఇప్పటికే ఆ షూట్‌ను పూర్తి చేసుకుంది. దీనితో పాటు 'గమణం', 'నారగసూరన్', 'తడ్కా' అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవన్నీ షూట్ కంప్లీట్ అయ్యాయి. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించేందుకు సిద్ధం అవుతోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీ.. భర్తతో రచ్చ

అందులో మాత్రం ఫుల్ బిజీ.. భర్తతో రచ్చ


చేతి నిండా ఆఫర్లతో బిజీ అయినా.. శ్రీయ శరణ్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో ఖాతాలో తెరుచుకున్న ఈ బ్యూటీ.. అన్నింట్లోనూ పోస్టులు పెడుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, సినిమా అప్‌డేట్లను సైతం తరచూ దీని ద్వారానే ఇస్తుంటుంది. ఇక, తన భర్తతో తరచూ టూర్లు వెళ్తూ రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే అతడితో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ హాట్ టాపిక్ అవుతోంది.

 అందాలతో వల వేస్తూ.. ఇప్పుడెక్కువగా

అందాలతో వల వేస్తూ.. ఇప్పుడెక్కువగా

శ్రీయ శరణ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఆమె ఈ మధ్య కాలంలో మరింతగా యాక్టివ్ అయింది. అంతేకాదు, వివాహం జరిగిన తర్వాతనే తన అందచందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తుంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇటీవలి కాలంలో ఎక్కువగా బికినీ ధరించి అందాలు ఆరబోస్తున్న ఫొటోలను వదులుతోంది. తద్వారా కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. అదే సమయంలో తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను క్రమక్రమంగా పెంచుకుంటూ దూసుకుపోతోంది.

Recommended Video

Kangana, Manoj Bajpayee, Dhanush Win at 67th National Film Awards

శ్రీయ భర్త పాడు పనులు.. దారుణంగా

తాజాగా శ్రీయ శరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్ ప్లేస్‌లో తీసుకున్న ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ఓ పాట పాడుతుండగా ఆండ్రీ దానికి స్టెప్పులు వేస్తూ కనిపించాడు. అలా పాట పాడుతూ పాడుతూ అతడిని 'ఉమ్మ ఉమ్మ' అంటూ రెచ్చిగొట్టింది. దీంతో ఆండ్రీ.. శ్రీయ పెదాలపై ముద్దులు పెట్టేశాడు. దీంతో ఈ లైవ్ వీడియోను శ్రీయ వెంటనే ఆపేసింది. ఇక, దీనికి నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఇది వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా చాలా క్యూట్‌గా ఉందని కామెంట్లు చేస్తుండడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X