Tripti Dimri: బంపర్ ఆఫర్ కొట్టేసిన కొత్త నేషనల్ క్రష్... తెలుగు బేస్డ్ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్?

యానిమల్ సినిమాలో రష్మిక మందన్నా కంటే... ఎక్కువగా ఫేమస్ అయింది తృప్తి డిమ్రి. ఈ భామ ఎప్పుడైతే ఈ సినిమా తీసిందో కానీ... అందరికీ నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఈ భామ ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ సీక్వెల్ ఆషికీ 3లో ఛాన్స్ కొట్టేసింది. ఇక తెలుగులో కూడా ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్... తృప్తి నక్క తోక తొక్కిందిరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అయి... ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో తృప్తి డిమ్రి నటించింది.

Animal Beauty Tripti Dimri Getting Heroine Chance in Allu Arjun Trivikram Movie Full Details Here

ఇక ఈ భామ యానిమల్ సినిమాలో నటించి.. అందరి చూపు తనవైపుకు తిప్పుకుంది. రష్మిక మందన్నా కంటే.. ఈ భామకే ఎక్కువగా క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా అనంతరం తృప్తి డిమ్రి గురించి అందరు శోధన చేశారు. అంతే కాదు.. ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు త్రిప్తి అంటే ఎవరికి తెలియదు.. కానీ ఇప్పుడేమో నేషనల్ క్రష్ గా మారిపోయింది.

సందీప్ రెడ్డి వంగా పుణ్యమంటూ ఈ బ్యూటీ పేరు ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది. చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ చాలా బోల్డ్ పాత్ర కావడంతో కుర్రాళ్ళు తెగ ఫిదా అయిపోయారనే చెప్పాలి. ఇక ఈ భామకు సూపర్ హిట్ సీక్వెల్ లో హీరోయిన్ ఛాన్స్ దక్కింది. ఆషికీ, ఆషికీ 2 సినిమాలు ఎంత సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Animal Beauty Tripti Dimri Getting Heroine Chance in Allu Arjun Trivikram Movie Full Details Here

నేటికి ఈ సినిమాల పాటలు వింటూ ఉంటాం. అలాంటి చిత్రానికి సీక్వెల్ గా ఆషికీ 3 తెరకెక్కుతుంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇదిలా ఉంటే.. మరో తెలుగు బేస్ డ్ పాన్ ఇండియా చిత్రంలో కూడా ఛాన్స్ దక్కించుకుంది ఈ భామ. అది కూడా అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ.

Animal Beauty Tripti Dimri Getting Heroine Chance in Allu Arjun Trivikram Movie Full Details Here

త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ సరసన ఈ బ్యూటీ నటిస్తుండటం.. మరింత ఆసక్తి రేకిస్తుంది. వీరి రొమాన్స్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. అబ్బా నేషనల్ క్రష్ నక్క తోక తొక్కిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ... ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X