యానిమల్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. చూపు తిప్పుకోలేని ఫోజులతో రచ్చ..

Tripti Dimri: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ అండ్ కల్ట్ మూవీ యానిమల్. ఈ బ్లాక్ బస్టర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ (Tripti Dimri). ఎంతో మంది ఫ్యాన్స్ సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలో కూడా ఈ అమ్మడు ఒక్కసారిగా ట్రెండింగ్‌ స్టార్‌ మారారు. దీంతో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫొటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూత్ కి స్పెషల్ ట్రీట్ ని అందిస్తోంది. ఆ లెటెస్ట్ ఫోటో షూట్ వైరలవుతోంది.

బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రిప్తి డిమ్రి ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మామ్, పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను వంటి చిత్రాల్లో నటించింది. కానీ, అమ్మడుకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆ తరువాత వచ్చిన 'బుల్ బుల్' చిత్రంతోనే ఫేమస్ అయ్యింది. ఈ ఫేమ్ తో 'యానిమల్' అనే సినిమా పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది.

Animal beauty Tripti Dimri latest photoshoots viral in Instagram

ఎవరి ఎప్పుడు అద్రుష్టం కలిసివస్తోందో ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. సినిమాల్లో కూడా ఇదే పరిస్థితి.కొన్ని సార్లు చాలా లెంగ్తీ క్యారెక్టర్లు చేసినా.. కష్టపడి నటించిన సరైన గుర్తింపు రాదు.కొన్ని సార్లు సార్ట్ లెంగ్త్ క్యారెక్టర్ నటించిన ఊహించని రీతిలో పాపులారిటీ లభిస్తోంది. అచ్చు అలాగే.. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రికి యానిమల్ మూవీతో కలిసివచ్చింది. యానిమల్ సినిమాతో బ్యూటీ త్రిప్తి తన అందంతో పాటు బోల్డ్ నెస్ తో మరొకసారి అందరిని ఆశ్చర్యపరిచింది.

ముఖ్యంగా రణ్‌బీర్‌తో బెడ్ సీన్, న్యూడ్‌గా కనిపించి అందరి అటెన్షన్‌ను తన వైపు తిప్పుకుంది. మేయిన్ లీడ్ రష్మికనే అయినా.. ఆమెనే డామినేట్ చేసింది త్రిప్తి దిమ్రి. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ అందానికి బాలీవుడ్ ఫిదా అయింది. ఈమె అందం నటనతో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. దీంతో త్రిప్తి దిమ్రీ ఓవర్ నైట్ కి స్టార్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత వరుసగా పలు సినిమాలలో బోల్డ్ ఆఫర్స్ కంటిన్యూ చేస్తుంది. అలాగే..నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ షోలతో ఫ్యాన్ గుండెల్లో తుటాలు దించుతోంది.

ఇక బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ... విక్కీ విద్య కా వో వాలా వీడియో, భుల్ భూలయా 3, బ్యాడ్ న్యూస్, దఢక్ 2లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. త్రిప్తి డిమ్రీ ఎప్పుకటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూత్ కి స్పెషల్ ట్రీట్ ని అందిస్తోంది. అలాగే.. ఈసారి మోడ్రన్ డ్రెస్ లో హాట్ పోజులు ఇచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఆ ఫోటోలు కుర్రాళ్లని ఫిదా చేస్తూ..సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: triptii dimri animal movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X