రణబీర్ ఇంటి పక్కనే లగ్జరీ ఇల్లు కొన్న యానిమల్ హాట్ బ్యూటీ... ఎన్ని కోట్లు ఖర్చు చేసిందో తెలుసా?

యానిమల్ మూవీ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోల్డ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి. ఈ సినిమాలో బోల్డ్ గా నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్న త్రిప్తి గురించి ఎలాంటి వార్త బయటకు వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ రణబీర్ కపూర్ ఇంటి పక్కనే ఇల్లు కొన్నదన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. మరి ఆమె ఇల్లు కొనడానికి ఎంత ఖర్చు పెట్టింది అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

త్రిప్తి దిమ్రి యానిమల్ మూవీతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో వరుస అవకాశాలు త్రిప్తి ఇంటి తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం తృప్తి చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో మొత్తం బాలీవుడ్ సినిమాలే ఉండడం గమనార్హం.

Animal fame Tripti Dimri purchases bungalow in Mumbai s Bandra for 14 crore

కంటిన్యూగా సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్న తృప్తి తాజాగా ముంబైలోని ఖరీదైన సెలబ్రిటీ ఏరియా బాంద్రాలో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలోని కార్టర్ రోడ్‌లో త్రిప్తి డిమ్రీ విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేసింది.

ఆ బంగ్లా విలువ దాదాపు 14 కోట్లు అని సమాచారం. ఈ బంగ్లా 20,193 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, గ్రౌండ్ ఫ్లోర్ తో సహా మొత్తం మూడు ఫ్లోర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. జూన్ 3న దీనికి సంబంధించిన డీల్ పూర్తయ్యిందని, త్రిప్తి ఈ ఆస్తికి 70 లక్షల స్టాంపు డ్యూటీ, 30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్టుగా తెలుస్తోంది.

ఇక 2023లో బాంద్రా వెస్ట్ లోనే అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులు కూడా ఓ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశారు. దాని ఖరీదు 37.80 కోట్లు. మొత్తానికి రణబీర్ కపూర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆయన ఇరుగు పొరుగునే ఇంటిని కొనడం చర్చకు దారి తీసింది. బాంద్రా వెస్ట్ లో ఇప్పటికే జాన్వి కపూర్, కాజోల్, రేఖ, పూజ హెగ్డే వంటి సెలబ్రిటీలంతా నివాసం ఉంటున్నారు.

Animal fame Tripti Dimri purchases bungalow in Mumbai s Bandra for 14 crore

ఇక త్రిప్తి సినిమాల విషయానికొస్తే 2023లో యానిమల్‌ మూవీ కారణంగా వచ్చిన పాపులారిటీతో IMDbలో అత్యధికంగా వీక్షించిన టాప్ 100 భారతీయ తారల జాబితాలో త్రిప్తి కన్పించింది. 2024 మేలో బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా కొత్త చిత్రం ధడక్ 2ని ప్రకటించారు.

More from Filmibeat

Read more about: tripti dimri
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X