Rashmika Mandanna: రష్మికను చావు దెబ్బ కొట్టిన ఆ హీరోయిన్... ఏకంగా ట్యాగ్ నొక్కేసిందిగా!
నేషనల్ క్రష్ ఎవరు అనగానే టక్కున రష్మిక మందన్నా అని చెప్తారు. అంతలా ఈ బ్యూటీ పాపులర్ అయింది. పుష్ప సినిమాతో రష్మిక మందన్నాకు దేశవ్యాప్తంగా గుర్తింపు, క్రేజ్ లభించింది. ఇక నేషనల్ క్రష్ గా రష్మిక మందన్నా పిలుపించుకుంది. అయితే ఈ భామను మరో బ్యూటీ చావు దెబ్బ కొట్టేసింది. ఏకంగా నేషనల్ క్రష్ ట్యాగ్ ను ఇప్పుడు మరో హీరోయిన్ కొట్టేసింది. అసలు ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు అంత పాపులర్ అయిందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రష్మిక మందన్నా పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా ట్యాగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ భామ తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది. ఇటీవల ఈ భామ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ తో కలిసి లిప్ లాక్ సీన్స్ లలో రెచ్చిపోయి నటించింది. అయితే పాన్ ఇండియా రేంజులో పేరు, క్రేజ్ సంపాదించుకున్న ఈ భామను మరో భామ చావు దెబ్బ కొట్టిందని తెలుస్తోంది.

ఇక రష్మికకు ప్రేక్షకులు ఎంతో ప్రేమతో ఇచ్చిన నేషనల్ క్రష్ ట్యాగ్ ను మరో భామ కొట్టేసింది. అయితే ఆమె ఎవరో కాదు.. రష్మికతో కలిసి యానిమల్ సినిమాలో నటించిన తృప్తి డిమ్రి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఈ ఒక్క పేరే వినిపిస్తుందని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో అయితే త్రిప్తి డిమ్రి ఫోటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. రణ్‌బీర్ కపూర్ తో ఈ భామ చేసిన రొమాన్స్ చూసిన నెటిజన్స్ తెగ ఫిదా అయిపోయారు.
అయితే రష్మిక మందన్నా కంటే కూడా ఈ భామకే ఎక్కువగా పేరు వచ్చేసింది. ఈ చిత్రంలో జోయా పాత్రలో నటించిన బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రి.... సోషల్ మీడియాలో ఈ భామ పేరు ట్రెండ్ అవుతోంది. రణ్‌బీర్, రష్మిక కెమిస్ట్రీ కంటే.. త్రిప్తి దిమ్రి కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిప్తినే అసలైన నేషనల్ క్రష్ అంటూ నెటిజన్స్.. ఆమె పేరుకు ట్యాగ్ చేర్చి ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాతో త్రిప్తి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనే చెప్పాలి.

రణబీర్ కపూర్, తృప్తి దిమ్రీల జోడీ భవిష్యత్తులోనూ తెరపై చూడాలనుకుంటున్నట్లు ఫ్యాన్స్ పోస్టులు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 23, 1994న ఉత్తరాఖండ్‌లో జన్మించింది తృప్తి డిమ్రీ. యానిమల్ చిత్రం కంటే ముందే చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. యానిమల్ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. 'పోస్టర్ బాయ్స్ మూవీతో ఈ భామ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'కాలా', బుల్ బుల్ లాంటి చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకుంది.

తాజాగా రణబీర్ కపూర్ బ్లాక్ బస్టర్ యానిమల్ లో చేసిన చిన్న పాత్రతో ఒక్కసారిగా తృప్తి డిమ్రి స్టార్ స్టేటస్ కొట్టేసింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ భామకు తెలుగులో భారీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు నిర్మాతలు ఈ భామ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారట. చూడాలి మరి తెలుగులో ఏ సినిమా అయినా చేస్తుందా లేదా అనేది.


Click it and Unblock the Notifications











