రిలేషన్‌పై ఇక ఓపెన్.. బాయ్‌ఫ్రెండ్‌తో పబ్లిక్‌గా నేషనల్ క్రష్, ఒకే కారులో పార్టీకి
రణబీర్ కపూర్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన యానిమల్ మూవీతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు తృప్తి దిమ్రి. ఈ సినిమాలో జోయాగా ఆమె అద్భుతంగా నటించారు. అన్నింటికి మించి రణబీర్‌తో చేసిన బెడ్‌రూమ్ సీన్స్ ఆమెకు పేరుతో పాటు విమర్శల్ని మోసుకొచ్చింది. నిజానికి ఏడెనిమిదేళ్ల కిందట పోస్టర్ బాయ్స్‌తో ప్రారంభమైంది తృప్తి కెరీర్. అయితే ఆమెకు బ్రేక్ రావడానికి యానిమల్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. యానిమల్ మూవీ తృప్తి దిమ్రి జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
యానిమల్‌లో బెడ్‌రూం సీన్.. సినిమాకు అవసరం కాబట్టి నటించడానికి అంగీకరించానని , షూటింగ్ సమయంలో సందీప్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తృప్తి ఓ సందర్భంలో చెప్పారు. ఈ సీన్ తీసేటప్పుడు తాను, రణబీర్, దర్శకుడు, కెమెరామెన్ మాత్రమే ఉన్నామని ఆమె చెప్పింది. యానిమల్ తర్వాత నయా నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి దిమ్రీకి వరుసపెట్టి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం విక్కి విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలాయా 3, ధడక్‌లలో ఆమె నటిస్తున్నారు.

కెరీర్‌లో దూసుకెళ్తున్న తృప్తి దిమ్రీ పెళ్లి ఎప్పుడు అనే చర్చ అప్పుడో మొదలైంది. ఈమె లైఫ్ పైనా బోల్డెన్నీ రూమర్స్ వచ్చినా, తర్వాత అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే మోడల్ సామ్ మర్చంట్‌తో తృప్తి దిమ్రీ డేటింగ్ చేస్తున్నారని మీడియా కోడై కూస్తోంది. తృప్తి- సామ్‌లు తమ ప్రేమను అఫీషియల్‌గా బయటపెట్టనప్పటికీ.. వారు తరచూ కలుసుకుంటున్న ఫోటోలు, గోవా ట్రిప్‌లకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సామ్ మర్చంట్.. 2002లో గ్లాడ్రాగ్స్ మ్యాన్‌హంట్ కాంటెస్ట్‌లో గెలుపొందడంతో మోడలింగ్ ప్రపంచంలో అతని పేరు మారుమోగిపోయింది. మోడలింగ్ చేస్తూనే గోవాలో హాస్పిటాలిటీ కంపెనీని స్థాపించి వ్యాపారంలోకి ప్రవేశించారు సామ్. లగ్జరీ బీచ్ విల్లా కాసా వాటర్స్.. ఈవెంట్‌లు, వివాహాలు, ఉత్సవాలకు వేదిక అయిన అవౌర్ గోవాకు ఆయన యజమాని. సోషల్ మీడియా కథనాలను బట్టి తృప్తి - సామ్ జంట 2017 నుంచి సన్నిహితంగా ఉంటున్నారట.
ఇన్నాళ్లు తమ బంధాన్ని గుట్టుగా ఉంచిన తృప్తి దిమ్రీ - సామ్ మర్చంట్‌లు ఈసారి మాత్రం బయటపెట్టేశారు. ఇటీవల ముంబైలో ఓ రొమాంటిక్ డిన్నర్ డేట్‌కు ప్రియుడితో కలిసి వెళ్లారు తృప్తి. వీరిద్దరూ ఒకే కారులో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిని తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా ప్రతినిధులు, జనం ఎగబడ్డారు. అలాగే సెలబ్రెటీ హెయిర్ స్టైలీష్ట్ ఆలిమ్ హకిం బర్త్ డే బాష్‌కు కూడా తృప్తి తన బాయ్‌ఫ్రెండ్ సామ్ మర్చంట్‌తో హాజరైందని బీటౌన్ మీడియా చెబుతోంది. తద్వారా తృప్తి- సామ్ మర్చంట్‌లు తమ బంధాన్ని బయటపెట్టేశారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











