Tripti Dimri: తృప్తి దిమ్రి 7 ఏళ్ల సీక్రెట్ అఫైర్ బట్టబయలు.. లవర్ ఎవరో తెలుసా?
చిత్ర పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు అదృష్టం కలిసొస్తుందో ఎవరికీ తెలియదు, ఒక్క ఛాన్స్ చాలు ఓవర్‌నైట్ స్టార్ అయిపోవడానికి. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌లో మూవీలో జోయాగా ఆమె అద్భుతంగా నటించారు. ముఖ్యంగా రణబీర్‌తో కలిసి చేసిన బెడ్‌రూమ్ సీన్స్ తృప్తికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ సీన్‌కు ఎంతటి పేరొచ్చిందో..అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొవాల్సి వచ్చింది.
ఏడెనిమిదేళ్ల కిందట పోస్టర్ బాయ్స్‌తో ప్రారంభమైంది తృప్తి కెరీర్. కానీ ఆమె అంటూ ఒక నటి ఉన్న సంగతి జనానికి తెలియడానికి యానిమల్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆమె నటించిన చిత్రాలు థియేటర్ కంటే ఓటీటీలోనే ఎక్కువగా విడుదలయ్యాయి. కానీ యానిమల్ ఆమె లైఫ్‌ను మార్చేసింది. సోషల్ మీడియాలోనూ తృప్తి దిమ్రికీ అభిమానులు భారీగా పెరిగిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 5 మిలియన్ల మందికి పైగా ఆమెను అనుసరిస్తున్నారు.

యానిమల్‌లో బెడ్‌రూం సీన్.. సినిమాకు అవసరం కాబట్టి నటించడానికి అంగీకరించానని తృప్తి దిమ్రి పేర్కొన్నారు. దానిని షూట్ చేసే సమయంలో సందీప్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.. అప్పుడు రూమ్‌లో తాను, రణబీర్, దర్శకుడు, కెమెరామెన్ మాత్రమే ఉన్నామని ఆమె చెప్పింది. తనకు అసౌకర్యంగా లేనప్పుడు, తాను చేస్తున్నది తప్పు కాదని నమ్మినప్పుడు, ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే సూత్రాన్ని తాను తూచా తప్పకుండా పాటిస్తానని తృప్తి తేల్చిచెప్పారు.
యానిమల్ తర్వాత నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి దిమ్రీకి వరుసపెట్టి అవకాశాలు క్యూ కడుతున్నాయి. విక్కి విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలాయా 3, ధడక్‌లలో ఆమె నటిస్తున్నారు. ప్రస్తుతం కుర్రాళ్ల కలల రాణిగా వెలుగొందుతున్న తృప్తి గుండెల్లో రాజు ఎవరు అనే చర్చ నడుస్తోంది. అయితే మోడల్ సామ్ మర్చంట్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. తృప్తి- సామ్‌లు తమ ప్రేమను బయటపెట్టనప్పటికీ.. వారు తరచూ డేట్‌లకు వెళ్లడాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ముంబైలోని బాంద్రా కుర్రాడే సామ్ మర్చంట్. 2002లో గ్లాడ్రాగ్స్ మ్యాన్‌హంట్ కాంటెస్ట్‌లో గెలుపొంది మోడలింగ్ ప్రపంచంలో తనకంటూ పేరు తెచ్చుకున్నాడు. అయితే మోడలింగ్ చేస్తూనే గోవాలో హాస్పిటాలిటీ కంపెనీని స్థాపించి వ్యాపారంలోకి ప్రవేశించారు సామ్. లగ్జరీ బీచ్ విల్లా కాసా వాటర్స్.. ఈవెంట్‌లు, వివాహాలు, ఉత్సవాలకు వేదిక అయిన అవౌర్ గోవాకు ఆయన యజమాని. తృప్తితో పాటు దిశా పటానీ, నటాసా స్టాంకోవిచ్, ప్రముఖ ఫోటోగ్రాఫర్ రాహుల్ ఝంగియానిలతో సామ్ మర్చంట్ సన్నిహతంగా ఉంటారు.
గడిచిన కొన్ని నెలలుగా తృప్తి- సామ్‌లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. సోషల్ మీడియా కథనాలను బట్టి ఈ జంట 2017 నుంచి సన్నిహితంగా ఉంటున్నారట. అయితే ఈ ఏడాది మార్చిలో జంటగా గోవా ట్రిప్‌కు వెళ్లి.. అక్కడి ఫేమస్ స్పాట్‌లలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మీడియాకు పనిపెట్టారు. ఇటీవల సామ్ - తృప్తిలు ముంబైలో ఓ విందులో సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇకనైనా అఫీషియల్‌గా తమ బంధాన్ని కన్ఫర్మ్ చేసి, త్వరగా పెళ్లి పీటలెక్కాలని నెటిజన్లు ఈ జంటను కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











