మరోసారి ప్రెగ్నెన్సీ ఫొటోలతో షాక్ ఇచ్చిన నువ్వు నేను హీరోయిన్.. ఈ సారి ఏకంగా బికినీలో..

పెద్దగా స్టార్ హీరోయిన్స్ గా ఎదగకపోయినా కూడా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ని జనాలు అంత ఈజీగా మర్చిపోలేరు. పెద్ద బడ్జెట్ సినిమాలు చేయని వాళ్ళు కూడా కేవలం ఒకట్రెండు సినిమాలతో జీవితానికి సరిపడా క్రేజ్ అందుకున్నారు. అలాంటి హీరోయిన్స్ లలో అనితా హస్సానందని ఒకరు. నువ్వు నేను సినిమాతో ఏ స్థాయిలో గుర్తింపు అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక చాలా రోజుల తరువాత అనిత ప్రెగ్నెన్సీ కి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండ హీరోయిన్ గ్లామర్ ఫోటోషూట్...

ఆ సినిమాతోనే భారీ క్రేజ్

ఆ సినిమాతోనే భారీ క్రేజ్

అనిత హస్సానందని ఎక్కువగా క్రేజ్ అందుకుంది నువ్వు నేను సినిమాతోనే. 2001లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో ఆమె ఉదయ్ కిరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాలు కూడా చేసిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లలో కూడా నటించింది.

జయాపజయాలతో సంబంధం లేకుండా

జయాపజయాలతో సంబంధం లేకుండా

అయితే మొదట సక్సెస్ అందునున్నప్పటికి ఆ తరువాత అనిత ఎక్కువగా క్లిక్కవ్వకలేకపోయింది. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా అటు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న అనిత గతంలో ఒక గుడ్ న్యూస్ తో జనాలను అమితంగా ఆకట్టుకుంది. త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తన భర్తతో కలిసి అప్పట్లో ఒక స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

లిప్ లాక్ ఫొటో కూడా వైరల్

లిప్ లాక్ ఫొటో కూడా వైరల్

రోహిత్ రెడ్డిని అనిత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్ళైన ఏడేళ్ళ అనంతరం వీరు బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇటీవల భర్తకు లిప్ లాక్ కూడా ఇచ్చిన ఫొటోలను కూడా షేర్ చేసుకున్న అనిత తన ప్రేమను అమితంగా ఇష్టపడుతున్నట్లు అర్ధమవుతోంది.

బికినీలో అనితా ఫోటోషూట్

బికినీలో అనితా ఫోటోషూట్

రీసెంట్ గా అనితా మరోసారి ఫొటో షూట్ లో పాల్గొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో ఏకంగా ఆమె బికినీ వేయడంతో ఫొటోలు నిమిషాల్లోనే వైరల్ గా మారాయి. ఇక భర్త రోహిత్ రెడ్డి బేబీ బంప్ పై ప్రేమను చూపిస్తూ భార్యను ముద్దాడుతున్నాడు.

ఎక్కువగా సీరియల్స్ తో..

ఎక్కువగా సీరియల్స్ తో..

ఇక అనిత కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ , హిందీ, మళయాళం, పంజాబీ భాషల్లో కూడా నటించింది. ముఖ్యంగా. ఆమె హిందీ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక 2013లో బిజినెస్ మెన్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్న అనిత ఆ తరువాత సినిమాలకు కాస్త దూరంగానే ఉంటోంది. ఎక్కువగా సీరియల్స్ తో బిజీగా మారుతోంది. అలాగే పలు రియాలిటీ షోల ద్వారా కూడా అనిత మంచి క్రేజ్ అందుకుంటోంది.

Recommended Video

Anitha Severe Comments On Industry Culture

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X