పవన్ కళ్యాణ్ నాకు చాలా స్పెషల్.. బయటపడ్డ స్టార్ హీరోయిన్..

Anjali: టాలీవుడ్ హీరోయిన్, తెలుగు అందం అంజలి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు తెలుగు హీరోయిన్ అయినా తమిళ సినిమాల ద్వారా ఫేమస్ అయ్యింది. వరుస సినిమాలు చేస్తూ.. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత తెలుగులో కూడా రీఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ , బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?

హీరోయిన్ అంజలి.. షాపింగ్ మాల్ ద్వారా పరిచయమైంది. ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళం సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించింది. ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లో సీత పాత్రలో నటించిన అంజలి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ హిట్ కావడంతో అంజలికి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ' వకీల్ సాబ్ ' సినిమాలో జరీనా పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది. సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. కారణం తెలియదు కానీ అంజలికి తెలుగులో అనుకున్నంత స్థాయిలో అవకాశాలు దక్కలేదు.

Anjali Comments On Pawan Kalyan and Tollywood Heroes in Ram Charan Game Changer promotion

తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- సక్సెస్ పుల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందిన గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్ చరణ్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాలో రామ్ చరణ్‌ డూయల్ రోల్ నటించగా.. అంజలి, కియారా అడ్వాణీ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్‌, నవీన్‌ చంద్ర, సునీల్‌, ఎస్‌.జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో పార్వతి అనే పాత్రలో నటించింది. తన కెరీర్ లోనే ది బెస్ట్‌ అని పేర్కొన్నారు. ఆ సినిమాలో నటించిన తర్వాత ఆలోచనా ధోరణిలో మార్పొచ్చిందని తెలిపారు. ఈ సినిమా జనవరి 10 న (శుక్రవారం) విడుదల కాబోతున్న సందర్భంగా అంజలి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది.

గేమ్‌ ఛేంజర్‌ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ అంజలి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా అంజలి మాట్లాడుతూ.. టాలీవుడ్లో తాను నటించిన హీరోలతో తన అనుభవాన్ని పంచుకుంది. తొలుత విక్టరీ వెంకటేష్ గురించి మాట్లాడుతూ.. యాక్టర్ గా ఆయన ఏ క్యారెక్టర్ నైనా చేయగలుగుతాడని, ప్రధానంగా ఎమోషన్స్, కామెడీ, జోక్స్ ఏదైనా సరే పుల్ ఆఫ్ చేయగలరు, ఆయన నటన సహజంగా ఉంటుందని పేర్కొంది.
ఆ తర్వాత మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. మహేష్ బాబు చాలా గ్రేట్ అని. ఆయన చుట్టూ స్పెషల్ ఆరా ఉంటుందని పేర్కొన్నారు. చూడ్డానికి చాలా బాగుంటారని, టాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అంటూ ప్రశంసలు గుప్పించింది. తర్వాత నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. బాలయ్య అంటేనే ఎనర్జీ అని, మనమైనా ఏ విషయంలో నైనా కాస్త టైడ్ అవుతాం కావచ్చు. కానీ, ఆయన ఆల్వేస్ ఫుల్ ఎనర్జీతో స్వింగ్ లో ఉంటారని పేర్కొంది.

Anjali Comments On Pawan Kalyan and Tollywood Heroes in Ram Charan Game Changer promotion

ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్ అందరితో రెస్పెక్ట్ ఫుల్ గా ఉండడం అందరినీ గౌరవిస్తూ ఉంటాడని చెప్పింది. కొన్నిసార్లు రాంచరణ్ మాట్లాడుతూ ఉంటే చిరంజీవి మాట్లాడినట్టు ఉంటుందన్నారు నటి అంజలి. చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవర్ స్టార్ గురించి ఒకటి రెండు అంటూ ఆయనలోని క్వాలిటీస్ చెప్పలేమని, ఆయనతో తాను వకీల్ సబ్ అనే సినిమాలో నటించానని, తాను నటించిన సహనటులలో పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్ అని, పవన్ కళ్యాణ్ ఆరా.. వైబ్స్ సెట్ మొత్తం స్ప్రెడ్ అవుతుందని, ఆయన నటిస్తూ ఉంటే అలా అని చూడాలనిపిస్తుందని చెప్పింది. వకీల్ సాబ్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ తో ఎంతో ఫ్రీగా ఉన్నామని, మాకు ఏ చిన్న సందేహం వచ్చినా ఆయనను అడుగుతే ఓపికగా సమాధానం ఇస్తారని, సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో క్లారిటీ ఇస్తారని పేర్కొంది. ప్రస్తుతం అంజలి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

More from Filmibeat

Read more about: anjali ram charan pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X