Don't Miss!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లాక్డౌన్లో కొత్త పార్ట్నర్తో అంజలి.. గృహ నిర్బంధంలో ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ
తెలుగు అమ్మాయి అంజలి ఇంట గెలిచి రచ్చ గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగులో నటనకు స్కోప్ ఉన్న పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే దక్షిణాదిలో తన మార్క్ చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించాయి. దాంతో సినీ తారలు గృహ నిర్బంధానికే పరిమితమయ్యారు. తాజాగా సినీ తార అంజలి క్వారంటైన్ పిరియడ్‌లో తన కొత్త పార్ట్నర్తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన కొత్త పార్ట్నర్ ఎవరంటే..
లాక్డౌన్ సమయంలో ఎంజాయ్ చేస్తూ
కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ అమలు అవుతున్న క్రమంలో గృహ నిర్బంధంలో తాను అనుభవిస్తున్న అద్బుత క్షణాలను ఫోటోలుగా బంధించి అభిమానులతో పంచుకొన్నారు. ఈ ఫోటోలలో తన పార్ట్నర్తో కలిసి హాట్ హాట్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్వారంటైన్ పార్ట్నర్తో
లాక్డౌన్ కాలంలో తన పెంపుడు కుక్క షిహ్ జు (పోలో)తో ఆడుకుంటూ కనిపించింది. తన పెంపుడు కుక్కను కూడా అభిమానులకు పరిచయం చేసింది. క్వాలిటీ టైమ్ విత్ పోలో అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇతనే నా క్వారంటైన్ పార్ట్నర్. కరోనా సమయంలో ఫస్ట్ టైమ్ పోలో ఇన్‌స్టాలోకి వచ్చింది అంటూ ఫొటోలను షేర్ చేసింది.
నా క్వాలిటీ సమయాన్ని ఇలా..
ప్రస్తుతం షేర్ చేసిన కొన్ని ఫోటోలు లాక్‌డౌన్‌కు ముందు చేసిన ఫోటోషూట్. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇలానే ఉంది. ఇంట్లో నేను పోలో తప్ప మరొకరు మా మధ్య రావడం లేదు. ఒంటరి సమయంలో బోర్డమ్ను ఇలా బ్రేక్ చేస్తున్నాను అని అంజలి పేర్కొన్నది. అలాగే ప్రతీ ఒక్కరు ఇంటి పట్టునే ఉంటూ కరోనాపై పోరాటం చేయండి అంటూ సందేశాన్ని ఇచ్చారు.
Recommended Video
అనుష్కతో కలిసి నిశ్శబ్దంలో
అంజలి కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అనుష్క శెట్టితో కలిసి నిశ్శబ్దం చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో సూపర్ నేచురల్ కిల్లర్ కోసం వెతికే అమెరికా పోలీసుగా కనిపించనున్నది. వాస్తవానికి నిశ్శబ్దం చిత్రం ఏప్రిల్ 4 తేదీన విడుదల కావాల్సింది. కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఇటీవల నటించిన రొసాపూ, సింధ్‌బాద్, నాడోడిగల్ 2 చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.